Jasprit Bumrah : ముంబయి ఇండియన్స్‌కు షాకిచ్చిన బుమ్రా.. ఐపీఎల్-16 సీజన్ నుంచి ఔట్?
బుమ్రా గాయం కారణంగా గత ఐదు నెలల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. 2022 సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో ఆడాడు. తర్వాత వెన్ను గాయం కారణంగా భారత్ ఆడిన వరుస సిరీస్‌లకు దూరమయ్యాడు.

Jasprit Bumrah
Jasprit Bumrah : ముంబయి ఇండియన్స్‌కు జస్ప్రీత్ బుమ్రా షాకిచ్చాడు. గతకొంత కాలంగా వెన్ను గాయంతో బాధపడుతున్న బుమ్రా.. ప్రస్తుతం ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకొని పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించేందుకు కసరత్తు చేస్తున్నాయి. అయితే, బ్రుమా గాయం గతంలో వైద్యులు నిర్ధారించిన దానికంటే తీవ్రంగా మారిందని, అతను పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయంపడుతుందని తెలుస్తోంది. దీంతో ఐపీఎల్ -16 సీజన్‌లో బుమ్రా ఆడటం కష్టమే. బుమ్రా ముంబయి ఇండియన్స్ జట్టు తరపున బరిలోకి దిగాల్సి ఉంది. ఆ జట్టులో బుమ్రా కీలక ఆటగాడు. ఇలాంటి పరిస్థితుల్లో గాయంకారణంగా బుమ్రా ఐపీఎల్ కు దూరమవుతుండటం ఆ జట్టుకు షాకింగ్ విషయమే.
బుమ్రా గాయం కారణంగా గత ఐదు నెలల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. 2022 సెప్టెంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో ఆడాడు. తర్వాత వెన్ను గాయం కారణంగా భారత్ ఆడిన వరుస సిరీస్‌లకు దూరమయ్యాడు. గాయం అనంతరం.. ఇండియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది. రెండు టెస్టు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్‌లకోసం బుమ్రా కూడా ఎంపికయ్యాడు. కానీ ఫిట్నెస్ సాధించకపోవటంతో బుమ్రా టెస్టుల్లో ఆడలేదు. టెస్టు సిరీస్ అనంతరం మూడు వన్డేల సిరీస్‌లో బుమ్రా ఆడుతాడని భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కష్టమనే వాదన వినిపిస్తుంది.
Jasprit Bumrah Practice: నెట్స్‌లో చెమటోడ్చుతున్న టీమిండియా బౌలర్ బుమ్రా.. వీడియో చూడండి..
మరోవైపు జూన్‌లో లండన్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు టీమిండియా అర్హత సాధిస్తే ఆ మ్యాచ్ నాటికికూడా బుమ్రా ఫిట్‌నెస్ సాధించే అవకాశాలు కనిపించడం లేదు. భారత్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బుమ్రా లేకపోవటం టీమిండియాకు ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. బూమ్రా గాయంనుంచి త్వరగా కోలుకోకుంటే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు, టీమిండియాకు గట్టి దెబ్బే అని చెప్పాలి.