Jasprit Bumrah : టీ20 వరల్డ్ కప్‌కు ముందు టీమిండియాకు షాక్.. ఆ స్టార్ బౌలర్ దూరం.. అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ

టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు ఇది షాక్ అనే చెప్పాలి. స్టార్ బౌలర్ జట్టుకు దూరం అయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా అనౌన్స్ చేసింది.

Jasprit Bumrah : టీ20 వరల్డ్ కప్‌కు ముందు టీమిండియాకు షాక్.. ఆ స్టార్ బౌలర్ దూరం.. అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ

Jasprit Bumrah : టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు ఇది షాక్ అనే చెప్పాలి. స్టార్ బౌలర్ జట్టుకు దూరం అయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా అనౌన్స్ చేసింది. టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయంపై అనిశ్చితి వీడింది. బుమ్రా టీ20 వరల్డ్ కప్ కు దూరమయ్యాడని బీసీసీఐ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. బుమ్రా పరిస్థితిని నిపుణులైన వైద్యబృందం పరిశీలించిందని, అతడు వరల్డ్ కప్ లో ఆడే అవకాశాలు లేవని ఆ బృందం నిర్ధారించిందని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. టీ20 వరల్డ్ కప్ లో బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి పేరును త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

వీపు గాయంతో బుమ్రా ఇప్పటికే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. వరల్డ్ కప్ లో బుమ్రా వంటి బౌలర్ లేకపోతే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని టీమిండియా మేనేజ్ మెంట్ కు తెలియంది కాదు. టోర్నీలోపు కోలుకుంటే బాగుండని కోరుకుంది. అందుకే అతడి గాయంపై తుది నివేదిక వచ్చేంత వరకు వేచి చూడాలని నిర్ణయించుకుంది.

బుమ్రా ఇంకా వరల్డ్ కప్ కు దూరం కాలేదంటూ కోచ్ ద్రావిడ్ ఇటీవల చెప్పడం ఫ్యాన్స్ లో ఆశలు రేకెత్తించింది. అయితే, బీసీసీఐ అధికారిక ప్రకటనతో బుమ్రా ఇక వరల్డ్ కప్ లో ఆడబోవడం లేదని తేలడంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు.

టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియాలో జరగనుంది. టీమిండియా ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్ ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో అక్టోబర్ 23న తలపడనుంది. పేస్ కు అనుకూలించే ఆస్ట్రేలియా పిచ్ లపై బుమ్రా ఎంతో ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బుమ్రా లేకపోవడం భారత జట్టుకు తీరని లోటే అంటున్నారు. మరిప్పుడు బుమ్రా ప్లేస్ లో ఎవరిని సెలెక్త్ చేస్తారన్నది ఆసక్తికర అంశం.

మరోవైపు దక్షిణాఫ్రికాతో భారత్ తన చివరి, మూడో టీ20 మ్యాచ్ తలపడనుంది. ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా ఎలాంటి ప్రాధాన్యం లేని ఈ మ్యాచ్ కోసం జట్టులో కొన్ని మార్పులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కు విశ్రాంతి ఇచ్చింది. కొన్నిరోజుల్లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ప్రధాన బ్యాట్స్ మెన్ పై భారం పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.