Electra Stumps : క్రికెట్​ చరిత్రలో తొలిసారి ఎలక్ట్రా స్టంప్స్ వినియోగం.. అంపైర్‌లా పనిచేస్తాయట? ఐపీఎల్‌లో వినియోగం ఎప్పుడంటే

బీబీఎల్ లో ఎలక్ట్రా స్టంప్ లు వినియోగిస్తున్నారు. దీంతో 2024 ఐపీఎల్ టోర్నీలోనూ ఈ తరహా స్టంప్స్ కనిపిస్తాయా అనే ప్రశ్న క్రికెట్ అభిమానుల్లో ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ లో ఎల్‌ఈడీ లైట్లతో కూడిన స్టంప్‌లను ఉపయోగిస్తున్నారు.

Electra Stumps : క్రికెట్​ చరిత్రలో తొలిసారి ఎలక్ట్రా స్టంప్స్ వినియోగం.. అంపైర్‌లా పనిచేస్తాయట? ఐపీఎల్‌లో వినియోగం ఎప్పుడంటే

Big Bash League 2023

Electra Stumps In Big Bash League: జెంటిల్మెన్ గేమ్ గా పేరున్న క్రికెట్ ఆటలో రోజురోజుకు కొత్తకొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీ20 మ్యాచ్ ల ప్రారంభం తరువాత క్రికెట్ కు అభిమానుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పొచ్చు. దీనికితోడు ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) వంటి వాటితో క్రికెట్ అంటే అన్నివర్గాల్లో మరింత క్రేజ్ పెరిగింది. తాజాగా క్రికెట్​లోకి సరికొత్త స్టంప్స్ వచ్చిచేరాయి. ప్రస్తుతం ఎల్​ఈడీ లైట్లతో కూడిన స్టంప్స్ ను వినియోగిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా టీ20 బిగ్ బాష్ లీగ్‌లో కొత్త తరహా స్టంప్స్ (ఎలక్ట్రా స్టంప్స్) వినియోగించారు. ఈ స్టంప్ లలో వివిధ సందర్భాల్లో వివిధ రకాల లైట్లు కనిపిస్తాయి.

Also Read : Yuzvendra Chahal : చాహల్-ధనశ్రీ వివాహ బంధానికి మూడేళ్లు.. వారిద్దరి డ్యాన్స్ వీడియోను షేర్ చేసి ధనశ్రీ.. చాహల్ గురించి ఏమందంటే?

ఈ ఎలక్ట్రా స్టంప్స్  (Electra Stumps) వల్ల ఫోర్లు, సిక్సర్ల నుంచి నో బాల్స్ వరకు ప్రతి సందర్భంలోనూ విభిన్నమైన రంగులు చూడొచ్చు. బిగ్ బాష్ లీగ్ లో శుక్రవారం ఆడిలైడ్ స్ట్రైకర్స్, సిడ్నీ సిక్సర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలిసారి ఎలక్ట్రా స్టంప్స్ వినియోగించారు. మ్యాచ్ కు ముందు మార్క్ వా, మైఖేల్ వాన్ ఈ స్టంప్స్ గురించి వివరించారు. మహిళల బిగ్ బాష్ లో ఈ తరహా స్టంప్స్ ను వినియోగిచడం జరిగిందని తెలిపారు. అయితే, పురుషుల క్రికెట్ టోర్నమెంట్ లో వీటిని ఉపయోగించడం ఇదే తొలిసారి అని మైఖేల్ వాన్ చెప్పారు. మార్క్ వా ఈ స్టప్స్ ఎలా పనిచేస్తాయనే విషయాన్ని వివరించారు.

Also Read : PV Sindhu : ఫోర్బ్స్ జాబితాలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ.. టాప్ 20లో ఏకైక భారతీయురాలు.. ఈ ఏడాది ఆమె సంపాదన ఎంతంటే?

సాధారణంగా ప్రస్తుతం క్రికెట్ లో వాడుతున్న వికెట్లు ఔట్, స్టంపౌట్, రనౌట్ అయినప్పుడు మాత్రమే లైట్లు వెలుగుతాయి. వికెట్ల ను బంతి, బ్యాట్, చేయి తాకినా.. బెయిల్స్ ఎగిరినా లైట్స్ వస్తాయి. ఎప్పుడు లైట్స్ వచ్చినా రెడ్ కలర్ లో మాత్రమే వెలుగుతాయి. శుక్రవారం ఆస్ట్రేలియాలో బీబీఎల్ లో వినియోగించిన ఎలక్ట్రా స్టంప్స్ ఐదు సార్లు లైట్స్ వస్తాయి.

వికెట్ పడినప్పుడు :- వికెట్ పడినప్పుడు బ్యాటర్ ఏ విధంగా ఔట్ అయినా స్టంప్స్ ఎర్రటి రంగులో కనిపిస్తాయి.
ఫోర్ కొట్టినప్పుడు :- బ్యాటర్ బంతిని బౌండరీకి తరలించినప్పుడు.. బౌండరీని తాకగానే ఈ స్టంప్స్ లలో వివిధ రకాల రంగుల్లో లైట్లు వేగంగా కదులుతాయి.
సిక్స్ కొట్టినప్పుడు :- బ్యాటర్ బంతిని సిక్స్ కొట్టినప్పుడు బౌండరీ లైన్ బయట పడగానే స్టంప్స్ లైట్లు వివిధ రంగుల్లో స్క్రోలింగ్ గా కనిపిస్తాయి.
నో బాల్ :- బౌలర్ నోబాల్ వేసినప్పుడు ఎరుపు, తెలుపు రంగుల్లో స్టంప్స్ కనిపిస్తాయి.
ఓవర్ల మధ్య : ఒక ఓవర్ ముగిసే సమయానికి, తర్వాతి ఓవర్ ప్రారంభానికి మధ్య స్టంప్స్ పై ఊదా, నీలం రంగులో వెలుగుతూ కనిపిస్తాయి.
వీటి వల్ల ఓవరాల్ గా క్రికెట్ తీరు మారనుంది. మొత్తంమీద స్టంప్ యొక్క రంగులు కూడా ఒకవిధంగా అంపైరింగ్ గా పనిచేస్తాయని మాజీ క్రికెట్లు పేర్కొంటున్నారు. అంటే.. అంపైర్ నిర్ణయం కంటే ముందే ఈ ఎలక్ట్రా స్టంప్స్ వల్ల ఫలితం మనకు తెలిసిపోతుంది.

Also Read : IPL 2024 : ఐపీఎల్‌లో కొత్త నిబంధ‌న‌..? బ్యాట‌ర్ల‌కు క‌ష్ట‌కాలం మొద‌లు..! ఫ‌లితాలు తారు మారు..?

ఐపీఎల్ లో ఎప్పుడు?
బీబీఎల్ లో ఎలక్ట్రా స్టంప్ లు వినియోగిస్తున్నారు. దీంతో 2024 ఐపీఎల్ టోర్నీలోనూ ఈ తరహా స్టంప్స్ కనిపిస్తాయా అనే ప్రశ్న క్రికెట్ అభిమానుల్లో ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ లో ఎల్‌ఈడీ లైట్లతో కూడిన స్టంప్‌లను ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రా స్టంప్స్ వినియోగంపై ఎలాంటి చర్చలు జరగలేదు.

 

ఎలక్ట్రా స్టంప్స్ పనితీరు ఈ వీడియోలో చూడొచ్చు..