PV Sindhu : ఫోర్బ్స్ జాబితాలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ.. టాప్ 20లో ఏకైక భారతీయురాలు.. ఈ ఏడాది ఆమె సంపాదన ఎంతంటే?

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ ఫోర్బ్స్ జాబితాలో ఈ ఏడాదికూడా చోటుదక్కించుకుంది. 2023లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన 20మంది మహిళా అథ్లెట్ల జాబితాలో 16వ స్థానంలో సింధూ నిలిచింది.

PV Sindhu : ఫోర్బ్స్ జాబితాలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ.. టాప్ 20లో ఏకైక భారతీయురాలు.. ఈ ఏడాది ఆమె సంపాదన ఎంతంటే?

PV Sindhu

Updated On : December 23, 2023 / 10:24 AM IST

PV Sindhu Forbes List : భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ ఫోర్బ్స్ జాబితాలో ఈ ఏడాదికూడా చోటుదక్కించుకుంది. 2023లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన 20మంది మహిళా అథ్లెట్ల జాబితాలో 16వ స్థానంలో సింధూ నిలిచింది. ప్రతీఏడాది ఫోర్బ్స్ ఈ జాబితాను విడుదల చేస్తుంది. తాజాగా విడుదల చేసిన జాబితాలో టెన్నిస్ తార, పోలండ్ కు చెందిన ఇగా స్వియాటెక్ అగ్రస్థానంలో నిలిచింది. ఆమె ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ ప్లేయర్ గా నిలిచింది. పి.వి. సింధూ ఈ ఏడాది 7.1 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 60 కోట్లు)తో అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ తో కలిసి 16వ స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ 2023 జాబితాలో భారతదేశం నుంచి టాప్ – 20లో నిలిచిన ఏకైక మహిళా అథ్లెట్ పీవీ సింధూనే.

PV Sindhu

గత కొన్నేళ్లుగా ఫోర్బ్స్ జాబితాలో సింధూ ఉంటూ వస్తోంది. 2018లో టాప్-10లో నిలిచిన ఆమె.. రూ. 70 కోట్లతో అత్యున్నతంగా ఏడో స్థానాన్ని దక్కించుకుంది. 2022లో 12వ స్థానంలో నిలిచింది. తాజాగా విడుదలైన 2023 ఫోర్బ్స్ జాబితాలో సింధూ 16వ స్థానంలో నిలిచింది. సింధూ సుమారు రూ.60కోట్ల సంపాదన కలిగి ఉంది. ఈ ఏడాది సింధూకు మైదానంలో ఏమాత్రం కలిసిరాలేదు. ఈ ఏడాది మ్యాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ లో రన్నరప్ గా నిలవడమే సింధూ అత్యుత్తమ ప్రదర్శన. డెన్మార్క్ ఓపెన్, ఆర్కిటిక్ ఓపెన్ లలో ఆమె సెమీస్ తోనే సరిపెట్టుకుంది. ఒక్క ట్రోఫీకూడా నెగ్గని సింధూ సంపాదనలో మాత్రం వెనుకంజ వేయలేదు.

PV sindhu

PV sindhu

ఫోర్బ్స్ 2023 జాబితాలో ప్రపంచంలో అత్యధిక సంపాదన కలిగిన టాప్-20 మహిళా అథ్లెట్ల ర్యాంకింగ్ ను వెల్లడించింది. వీరి ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ ఆదాయాలు మొత్తం కలిపి 226 మిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ జాబితా పేర్కొంది. తాజాగా వెల్లడైన ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో స్వియాటెక్ ఆదాయం 23.9 మిలియన్ల డాలర్లు (సుమారు రూ. 199కోట్లు) నిలిచింది. రెండో స్థానంలో చైనాకు చెందిన ఫ్రీస్టైల్ స్కీయింగ్ స్టార్ గూ ఐలింగ్ ( Gu Ailing 22.1 మిలియన్ డాలర్లు) నిలిచింది. మూడో స్థానంలో కోకో గాఫ్ (Coco Gauff 21.7 మిలియన్ డాలర్లు), నాల్గో స్థానంలో ఎమ్మా రాడుకాను (Emma Raducanu 15.2 మిలియన్ డాలర్లు), ఐదో స్థానంలో నవోమి ఒసాకా (Naomi Osaka 15 మిలియన్ డాలర్లు).