BCCI : బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్‌ బింద్రా కన్నుమూత

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాజీ అధ్యక్షుడు ఇందర్‌జిత్ సింగ్ బింద్రా క‌న్నుమూశారు.

BCCI : బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్‌ బింద్రా కన్నుమూత

Former BCCI president IS Bindra passes away aged 84

Updated On : January 26, 2026 / 9:51 AM IST

BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాజీ అధ్యక్షుడు ఇందర్‌జిత్ సింగ్ బింద్రా క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఆదివారం ఆదివారం (జనవరి 21న) కన్నుమూశారు. ఆయన వ‌య‌సు 84 ఏళ్లు. ఆయ‌న‌కు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.

1993 నుంచి 1996 వ‌ర‌కు బింద్రా బీసీసీఐ అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 1978 నుంచి 2014 వ‌ర‌కు ఉన్నారు. ఆయ‌న చేసిన సేవ‌ల‌కు గుర్తింపుగా 2015లో PCA స్టేడియం పేరును IS బింద్రా స్టేడియంగా మార్చారు.

SA20 : ముచ్చ‌ట‌గా మూడోసారి సౌతాఫ్రికా టీ20 లీగ్ విజేత‌గా స‌న్‌రైజ‌ర్స్.. కావ్య పాప ఆనందాన్ని చూశారా?

బింద్రా.. భారత క్రికెట్ పరిపాలనలో ఒక మహోన్నత వ్యక్తి. ఆయ‌న 1975లో అధికారిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 1987లో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను భార‌త్‌లో నిర్వ‌హించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. 1975, 1979, 1983 ఎడిషన్‌ల తర్వాత ప్రపంచ ఈవెంట్‌ను ఇంగ్లాండ్ బ‌య‌ట నిర్వ‌హించ‌డం ఇదే తొలిసారి.

IND vs NZ : ఈ మ్యాచ్ పోతే పోయింది.. ఆ మ్యాచ్‌లో మేమే గెలుస్తాం.. మా దృష్టంతా దానిపైనే.. మిచెల్ సాంట్న‌ర్ కామెంట్స్..

బింద్రా మృతి ప‌ట్ల ఐసీసీ చైర్మన్, మాజీ బీసీసీఐ కార్యదర్శి జే షా సంతాపం తెలిపారు.