Prakash Raj: బాలీవుడ్ సినిమాల్లో ఏముండదు.. అంతా డొల్ల.. ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ సినీ పరిశ్రమపై నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Prakash raj shocking comments on bollywood industry and movies
- బాలీవుడ్ సినిమాలు మ్యూజియంలో బొమ్మలాంటివి
- హిందీ సినిమా సామాన్య ప్రేక్షకులకు దూరం అయ్యింది
- బాలీవుడ్ మేకర్స్ గురించి ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్
Prakash Raj: దక్షిణాది నటుడు ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. బాలీవుడ్ సినిమాలు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం లో ఉండే బొమ్మల్లాంటివని, వాటిలో జీవం ఉండదు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ప్రకాష్ రాజ్(Prakash Raj) తాజాగా కేరళలో జరిగిన ‘కేరళ లిటరేచర్ ఫెస్టివల్’ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
Chiranjeevi: ఏమయ్యా చిరంజీవి.. లేడీ అభిమాని మాటలకు ఎమోషనల్ అయిన చిరంజీవి
ఈ సందర్బంగా ఆయన బాలీవుడ్ గురించి తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశాడు. బాలీవుడ్ సినిమాలు చూడటానికి అద్భుతంగా, కలర్‌ఫుల్‌గా ఉంటున్నాయి. కానీ, లోపల అంతా డొల్ల. హిందీ సినిమాలను చూస్తుంటే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని ప్లాస్టిక్ విగ్రహాల మాదిరిగా అనిపిస్తోంది. చూడటానికి అందంగా కనిపించినా వాటిలో జీవం ఉండటం లేదు. బాలీవుడ్ కేవలం లగ్జరీ లుక్స్, ప్రమోషన్లు, డబ్బు ఇలాంటి వాటి చుట్టూనే తిరుగుతోంది.
కానీ, తమిళ, మలయాళ దర్శకులు మట్టి కథలను, సమాజంలోని అట్టడుగు వర్గాల సమస్యలను, దళితుల వేదనను ఎంతో సహజంగా వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. మన వేర్లు మనం చెప్పే కథల్లో కనిపించాలి. ఇక్కడివాళ్ళు జై భీమ్, మామన్నన్ లాంటి సినిమాలు చేస్తుంటే.. బాలీవుడ్ మాత్రం కమర్షియల్ హంగులకే పరిమితమైంది. అందుకే, హిందీ సినిమాలు సామాన్య ప్రేక్షకులకు దూరమయ్యింది”అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. దీంతో ప్రకాష్ రాజ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హిందీ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ప్రకాష్ రాజ్ చేసిన ఈ కామెంట్స్ పై బాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.
