Chiranjeevi: ఏమయ్యా చిరంజీవి.. లేడీ అభిమాని మాటలకు ఎమోషనల్ అయిన చిరంజీవి
మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలబ్రేషన్స్ లో లేడీ అభిమాని గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన చిరంజీవి(Chiranjeevi).
Chiranjeevi emotional comments about his lady fan
- మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలబ్రేషన్స్
- లేడీ అభిమాని గురించి ప్రత్యేకంగా మాట్లాడిన చిరు
- మీకోసం ఎంత కష్టమైనా బరిస్తాను అని చెప్పిన చిరు
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన అభిమానుల పట్ల చాలా ప్రేమగా ఉంటారు. ప్రతీ స్టేజిపై వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్తారు. వాళ్ళ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను అంటూ తన కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. ఆకృతజ్ఞత నుంచి వచ్చినవే ఆయన నెలకొల్పిన ఛారిటీలు. అయితే, నిన్న ప్రత్యేకంగా ఒక అభిమాని గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు చిరంజీవి. ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు.
సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. కేవలం వారం రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ నేపధ్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఈ సందర్బంగా మన శంకర వరప్రసాద్ గారు ఇండస్ట్రీ హిట్ సెలెబ్రేషన్స్ ను నిర్వహించారు మేకర్స్. ఈ సందర్బంగా చిరంజీవి(Chiranjeevi) మాట్లాడుతూ ఒక లేడీ అభిమాని మాట్లాడిన మాటలను గుర్తు చేసుకున్నాడు.
“ఇటీవల నా లేడీ అభిమాని మాట్లాడిన వీడియో చూసి చాలా ఎమోషనల్ అయ్యాను. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ .. ‘ఏమయ్యా చిరంజీవి.. ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతూనే ఉన్నావు. ఓపిక ఉన్నా లేకపోయినా ఇప్పటికీ అలాగే కష్టపడుతున్నావు. కేవలం డబ్బు కోసం నువ్విలా పని చేస్తున్నావ్ అంటే నేను నమ్మను. నువ్వు అలా కష్టపడుతుంటే చూడటానికి కాస్త బాధగా ఉంది” అంటూ చెపుకొచ్చింది.
ఈ వీడియో చూసి చాలా ఎమోషనల్ అయ్యాను. నిజంగా ఆ తల్లికి ఈ సభా ముఖంగా నా ధన్యవాదాలు. ఆ తల్లి ఇచ్చిన ప్రశంసలు చాలా ప్రత్యేకం. అలాంటి అభిమానులను నాకు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. అమ్మా.. మిమ్మల్ని అలరించడానికి ఎంత కష్టమైనా పడతాను. ఆ కష్టంలోనే నా సంతోషాన్ని పొందుతాను. అభిమానుల పాజిటివ్ ఎనర్జీ నుంచే నాకు ఈ శక్తి వస్తోంది. ఈ జన్మ ఉన్నంత వరకు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాను” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు చిరంజీవి. దీంతో ఆయన మాట్లాడిన ఈ వీడియో వైరల్ గా మారింది.
