Pawan- Surender Reddy: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… పవన్- సురేందర్ రెడ్డి మూవీ షూటింగ్ ఎప్పటినుంచి అంటే?
పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి(Pawan- Surender Reddy) సినిమా మార్చ్ నుంచి షూటింగ్ మొదలుకానుంది.
Pawan Kalyan and Surender Reddy movie shooting will begin in March.
- పవన్- సురేందర్ రెడ్డి కొత్త మూవీ
- మార్చ్ నుంచి షూటింగ్
- వచ్చే ఏడాది విడుదల కానున్న సినిమా
Pawan- Surender Reddy: ఓజీ సినిమాతో రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. చాలా కాలంగా పవన్ కళ్యాణ్ ను ఆయన ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటుంన్నారో అలాగే చూపించి అదిరిపోయే హిట్ అందుకున్నాడు సుజీత్. ఇక ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు.
ఈ మార్చిలో విడుదల అయ్యే అవకాశం ఉందని టాక్. అయితే, ఇదే పవన్ కళ్యాణ్ లాస్ట్ సినిమా అని చాలా మంది అనుకున్నారు. కానీ, అనూహ్యంగా దర్శకుడు సురేందర్ రెడ్డితో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు పవన్ కళ్యాణ్(Pawan- Surender Reddy). ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు. వక్కంతం వంశీ కథ అందిస్తున్నాడు.
Srikanth Addala: శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమా ‘ప్రభల తీర్థం’.. త్వరలోనే అధికారిక ప్రకటన
ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచినప్పటినుంచి ఎప్పుడు మొదలవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు పవన్ ఫ్యాన్స్. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. మర్చి నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందట. మొదట హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది అని సమాచారం. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఈ న్యూస్ తెలియడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి విషయానికి వస్తే, ఏజెంట్ సినిమా డిజాస్టర్ తరువాత మరో సినిమా చేయలేదు ఈ దర్శకుడు. అందుకే, చాలా కాలంగా ఆయన పవన్ కళ్యాణ్ సినిమా కథపై వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు కథ పర్ఫెక్ట్ గా సెట్ అవడంతో దానికి పవన్ కళ్యాణ్ ఆమోద ముద్ర పడటంతో ఇప్పుడు ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి చాలా గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న సురేందర్ రెడ్డి ఈసారైనా హిట్ అందుకుంటాడా అనేది చూడాలి.
