దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు.. జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళులు
తెలంగాణలోని సికింద్రాబార్ పరేడ్ గ్రౌండ్స్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.
Modi at Republic Day Celebrations (Image Credit To Original Source)
- జాతీయ యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
- అమరావతిలో గవర్నర్ జాతీయ పతాక ఆవిష్కరణ
- సికింద్రాబార్ పరేడ్ గ్రౌండ్స్లో గణతంత్ర వేడుకలు
Republic Day: దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. “వందేమాతరానికి 150 ఏళ్లు” ప్రధాన ఇతివృత్తంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డేను నిర్వహిస్తున్నారు. వేడుకకు ముఖ్య అతిథులుగా ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ పాల్గొంటున్నారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళులు అర్పించారు.
Also Read: రిక్షాలో భార్యను కూర్చోబెట్టి 300 కి.మీ తీసుకెళ్లిన వృద్ధుడు.. ఎందుకో తెలిస్తే కన్నీరు అపుకోలేరు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారి గణంత్ర వేడుకలు జరిగాయి. ఏపీ హైకోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రి లోకేశ్, హైకోర్టు న్యాయమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలోని సికింద్రాబార్ పరేడ్ గ్రౌండ్స్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
