IND vs NZ : ఈ మ్యాచ్ పోతే పోయింది.. ఆ మ్యాచ్‌లో మేమే గెలుస్తాం.. మా దృష్టంతా దానిపైనే.. మిచెల్ సాంట్నర్ కామెంట్స్..
మూడో టీ20 మ్యాచ్‌లో తమ జట్టు ఓటమిపై (IND vs NZ) కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ స్పందించాడు.
IND vs NZ Mitchell Santner Comments after New Zealand lost match to India in 3rd ODI
- మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమి
- కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ కామెంట్స్
- గెలుపు క్రెడిట్ భారత బౌలర్లదే
IND vs NZ : టీమ్ఇండియా బౌలర్ల అసాధారణ ప్రదర్శన కారణంగానే తాము మూడో టీ20 మ్యాచ్‌లో ఓడిపోయామని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ వెల్లడించాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై భారత్ మరో 10 ఓవర్లు మిగిలి ఉండగా.. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (48; 40 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), మార్క్ చాప్‌మన్ (32; 23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మిచెల్ శాంట్నర్ (27; 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్, హార్దిక్ పాండ్య లు చెరో రెండు వికెట్లు తీశారు. హర్షిత్ రాణా ఓ వికెట్ సాధించాడు.
Shreyanka Patil : ప్రిన్సెస్ లా మెరిసిపోతున్న ఆర్‌సీబీ ప్లేయర్ శ్రేయాంక పాటిల్..
అనంతరం అభిషేక్ శర్మ (68 నాటౌట్; 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు), సూర్యకుమార్ (57 నాటౌట్; 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్థశతకాలు బాదగా.. ఇషాన్ కిషన్ (28; 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు వేగంగా ఆడడంతో భారత్ కేవలం 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కివీస్ బౌలర్లలో ఇష్ సోదీ, మాట్ హెన్రీ లు చెరో వికెట్ తీశారు.
టీమ్ఇండియా బౌలర్లదే క్రెడిట్..
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడాడు. టీమ్ఇండియా బౌలర్ల అద్భుత ప్రదర్శన కారణంగానే తాము ఓడిపోయామని చెప్పారు. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు పడగొట్టి తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారని చెప్పుకొచ్చాడు. అయినప్పటికి తాము పోరాడి 150 పరుగులు సాధించామని తెలిపాడు. నిజం చెప్పాలంటే ఈ పిచ్ పై 180 నుంచి 190 పరుగులు చేయాల్సి ఉందన్నాడు.
ఇక ఇది మంచి వికెట్ అని, ఈ వికెట్ పై 150 స్కోరును కాపాడుకోవడం చాలా కష్టమైన పని అని తెలుసునన్నాడు. చిన్న మైదానం, వేగతంతమైన ఔట్ ఫీల్డ్ ఉన్న కండీషన్స్‌లో వారు చాలా వేగంగా పరుగులు రాబట్టారని చెప్పాడు. ఇక టీ20 ప్రపంచకప్ కు ఇది మంచి సన్నద్ధత అని తెలిపాడు.
ఇలాంటి వికెట్ పై ఆడడం వల్ల మెగాటోర్నీలో తమకు కలిసి వస్తుందన్నాడు. మెగాటోర్నీలో తొలి మ్యాచ్‌లో చెన్నై వేదికగా అఫ్గానిస్తాన్‌తో ఆడాల్సి ఉంటుంది. అయితే.. అక్కడి పరిస్థితులు ఇక్కడితో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఇంకొన్ని రోజుల్లో ఇదే వేదికగా మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఇప్పటి ఓటముల నుంచి నేర్చుకుని ఆ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తామని మిచెల్ సాంట్నర్ తెలిపాడు.
