IND vs NZ : స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్ల వల్లే ఇదంతా.. పరీక్షలప్పుడు కూడా.. సూర్యకుమార్ యాదవ్ కామెంట్స్..
మూడో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించడంపై టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆనందాన్ని (IND vs NZ ) వ్యక్తం చేశాడు.
IND vs NZ Suryakumar Yadav Comments after India beat New Zealand in 3rd T20 match
- మూడో టీ20 మ్యాచ్‌లో కివీస్ పై విజయం
- మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్ కైవసం
- ఆనందాన్ని వ్యక్తం చేసిన టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
IND vs NZ : సమిష్టి ప్రదర్శనతోనే గౌహతి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించామని టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (48), మార్క్ చాప్‌మన్ (32), మిచెల్ శాంట్నర్ (27) లు రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీయగా.. రవి బిష్ణోయ్, హార్దిక్ పాండ్య లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హర్షిత్ రాణా ఓ వికెట్ సాధించాడు.
అనంతరం 154 పరుగుల లక్ష్యాన్ని భారత్ 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది. టీమ్ఇండియా బ్యాటర్లలో అభిషేక్ శర్మ (20 బంతుల్లో 68 నాటౌట్), సూర్యకుమార్ (26 బంతుల్లో 57 నాటౌట్) దంచికొట్టారు. సంజూ శాంసన్ డకౌట్ అయినప్పటికి ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 28 పరుగులు) వేగంగా ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఇష్ సోదీ, మాట్ హెన్రీ లు చెరో వికెట్ పడగొట్టారు.
దూకుడుతో కూడిన బ్రాండ్ క్రికెట్ ఆడతాం..
ఇక మ్యాచ్‌లో విజయం సాధించడంపై టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లు ఇచ్చిన స్వేచ్ఛతోనే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని చెప్పాడు. పరీక్షల సమయంలో కూడా వారు తనకు కావాల్సిన సెలవులు ఇచ్చారన్నాడు. వారిచ్చిన సెలవుల వల్లే తాను మైదానంలోకి వెళ్లి మరింత ఎక్కువగా ప్రాక్టిస్ చేయగలిగానని చెప్పుకొచ్చాడు. అక్కడే ఆట గురించి తాను మరింతగా నేర్చుకున్నానని తెలిపాడు.
ఇక లక్ష్య ఛేదన గురించి మాట్లాడుతూ.. ఈ విషయం గురించి తాము ముందే మాట్లాడుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. తాము తొలుత బ్యాటింగ్ చేసినా, లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉన్నా కూడా దూకుడుతో కూడిన క్రికెట్ ఆడాలని అనుకున్నట్లు చెప్పాడు. 20 పరుగులకే మూడు లేదా 40 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికి కూడా ఎలా బ్యాటింగ్ చేయాలో తమకు తెలుసునని అన్నాడు.
Shreyanka Patil : ప్రిన్సెస్ లా మెరిసిపోతున్న ఆర్‌సీబీ ప్లేయర్ శ్రేయాంక పాటిల్..
మేం వేరే బ్రాండ్ క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాం. అందుకు ఇదే సరైన మార్గం. ఇక టాప్ 2 లేదా 3 బ్యాటర్ల గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నాడు. వారి వల్ల తన పని చాలా తేలిక అవుతుందన్నాడు. ఇక బౌలర్ రవి బిష్ణోయ్ పై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి ప్రణాళికలు చాలా స్పష్టంగా ఉంటాయన్నాడు. ఒత్తిడిలో కూడా అతడు అద్భుతంగా రాణిస్తాడని అన్నాడు. అతడు జట్టులో ఉండడం చాలా సంతోషకరమైన విషయం అన్నాడు. ఇందు వల్ల మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కి కాస్త విశ్రాంతి దొరుకుతుందన్నాడు.
