Abhishek Sharma : గురువుకు కాస్త దూరంలో ఆగిపోయిన అభిషేక్ శ‌ర్మ‌.. ఇంకో రెండు బంతులు ముందుగా చేసి ఉంటేనా?

టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ (Abhishek Sharma) ఆకాశమే హ‌ద్దుగా ఆడుతున్నాడు.

Abhishek Sharma : గురువుకు కాస్త దూరంలో ఆగిపోయిన అభిషేక్ శ‌ర్మ‌.. ఇంకో రెండు బంతులు ముందుగా చేసి ఉంటేనా?

Abhishek Sharma 14 ball fifty vs New Zealand falls just short of mentor Yuvraj Singh

Updated On : January 26, 2026 / 8:41 AM IST

Abhishek Sharma : టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఆకాశమే హ‌ద్దుగా ఆడుతున్నాడు. త‌న దూకుడుతో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు నిద్ర‌లేని రాత్రుళ్లు మిగులుస్తున్నాడు. గౌహ‌తి వేదిక‌గా ఆదివారం న్యూజిలాండ్‌తో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనే పెను విధ్వంసం సృష్టించాడు. 20 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 7 ఫోర్లు, 5 సిక్స‌ర్ల సాయంతో 68 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.

అత‌డితో పాటు కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ (26 బంతుల్లో 57 నాటౌట్ ) చెల‌రేగ‌డంతో 154 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ 10 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భార‌త్ మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండ‌గానే కైవ‌సం చేసుకుంది.

IND vs NZ : ఈ మ్యాచ్ పోతే పోయింది.. ఆ మ్యాచ్‌లో మేమే గెలుస్తాం.. మా దృష్టంతా దానిపైనే.. మిచెల్ సాంట్న‌ర్ కామెంట్స్..

ఇక ఈ మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ 14 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ బాదాడు. ఈ క్ర‌మంలో అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచ‌రీ చేసిన భార‌త ఆట‌గాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఈ జాబితాలో యువ‌రాజ్ సింగ్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో యువ‌రాజ్ ఇంగ్లాండ్ పై 12 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ చేశాడు. ఇక అభిషేక్ శ‌ర్మ మెంటార్ యువ‌రాజ్ సింగ్ అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

IND vs NZ : స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్ల వ‌ల్లే ఇదంతా.. ప‌రీక్ష‌ల‌ప్పుడు కూడా.. సూర్య‌కుమార్ యాద‌వ్ కామెంట్స్‌..

అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచ‌రీలు చేసిన భార‌త ఆట‌గాళ్లు వీరే..

* యువరాజ్ సింగ్ – 12 బంతుల్లో (2007లో ఇంగ్లాండ్ పై)
* అభిషేక్ శర్మ- 14 బంతుల్లో (2026లో న్యూజిలాండ్ పై)
* హార్దిక్ పాండ్యా – 16 బంతుల్లో (2025లో ద‌క్షిణాఫ్రికాపై)
* అభిషేక్ శర్మ- 17 బంతుల్లో (2025లో ఇంగ్లాండ్‌పై)
* కేఎల్ రాహుల్ – 18 బంతుల్లో (2021లో స్కాట్లాండ్ పై)