IND vs PAK : ఈరోజు మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే సెమీస్‌కు.. పాకిస్థాన్ ఓడిపోతే..

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీలో హైఓల్టేజ్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. దుబాయ్ వేదికగా పాకిస్థాన్ వర్సెస్ ఇండియా జట్లు అమితుమీకి సిద్ధమయ్యాయి

IND vs PAK : ఈరోజు మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే సెమీస్‌కు.. పాకిస్థాన్ ఓడిపోతే..

IND vs PAK Match

Updated On : February 23, 2025 / 9:02 AM IST

Champions Trophy IND vs PAK : ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీలో హైఓల్టేజ్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. దుబాయ్ వేదికగా పాకిస్థాన్ వర్సెస్ ఇండియా జట్లు అమితుమీకి సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు.. ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టుపై విజయంతో భారత్ ప్లేయర్లు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. పాకిస్థాన్ జట్టు తన తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్ ఇవాళ్టి మ్యాచ్ లో ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశాలు ఎక్కువ. దీంతో టోర్నీలో నిలబడాలంటే పాకిస్థాన్ జట్టుకు గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఇదిలాఉంటే.. పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ మాజీ స్టార్ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: IND vs PAK: పాకిస్తాన్ మీద రోహిత్ సేన సర్జికల్ స్ట్రేకే.. ఆ పిచ్ మీద వీళ్లు చెలరేగితే..

బాసిత్ అలీ తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడారు. పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో భారత్ జట్టే ఫేవరెట్. అదే సమయంలో ఇది పాకిస్థాన్ కు డూఆర్ డై మ్యాచ్. ఒక విధంగా ఇది ఫైనల్ మ్యాచ్ అని చెప్పొచ్చు. భారత్ పై పాకిస్థాన్ జట్టు ఓడిపోయిన ప్రతిసారి పాకిస్థాన్ లో ఫ్యాన్స్ ఆందోళనలకు దిగడం సర్వసాధారణమే. టీవీలనుసైతం పగలగొడుతూ తమ ఆగ్రహాన్ని వెల్లగక్కుతుంటారు. అయితే, ఈసారి మాత్రం ఆ అవకాశం లేదని బాసిత్ అలీ చెప్పారు. ఎందుకంటే.. ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఇక్కడి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ప్రజలు చిన్నదానికి కూడా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఈసారి పాకిస్థాన్ జట్టు ఓడిపోయినా టీవీ సెట్లు పగిలిపోయిన శబ్దం వినిపించదని బాసిత్ అలీ చెప్పుకొచ్చాడు.

Also Read: IND vs PAK: ఇండియా vs పాక్ మ్యాచ్ లో పూనకాలేనా? విరాట్ కోహ్లీ ట్రాక్ రికార్డు చూస్తే.. ఇప్పటికీ అదే హయ్యస్ట్..

ఇవాళ్టి ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లో భారత్ జట్టే ఫేవరేట్. ఇందులో ఎలాంటి సందేహం లేదని బాసిత్ అలీ అన్నారు. పాకిస్థాన్ టీం నుంచి మూడో స్థానంలో క్రీజులోకి ఎవరు వస్తారో ఎవరీకీ తెలియదు. ఉస్మాన్ ఖాన్ ను ఇమామ్ తో కలిసి ఓపెనింగ్ చేయమని, బాబర్ అజామ్ ను మూడో స్థానంలో బ్యాటింగ్ కు తీసుకురావొచ్చు. ఇదిలాఉంటే.. ఛాంపియన్స్ ట్రోపీలో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య గత ఐదు మ్యాచ్ లలో విజయాల్లో భారత్ జట్టు ముందంజలో ఉంది. తాజా మ్యాచ్ కూడా భారత్ ఖాతాలోకి చేరే అవకాశం ఎక్కువ ఉంటుంది. భారత జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. విరాట్, రోహిత్ ఫామ్ లో లేకపోతే పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ సమతూకంగా ఉంటుందని బసిత్ చెప్పుకొచ్చాడు.