IND vs PAK: పాకిస్తాన్ మీద రోహిత్ సేన సర్జికల్ స్ట్రేకే.. ఆ పిచ్ మీద వీళ్లు చెలరేగితే..
ఐదుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు రాగా.. తన నిర్ణయాన్ని కెప్టెన్ సమర్ధించుకున్నారు.

IND vs PAK: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా.. అంటే.. ఆ మ్యాచ్ కి ఎప్పుడూ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. మనోళ్లకు పూనకాలు వచ్చేస్తాయి. పాక్ ని చిత్తు చిత్తుగా ఓడించాలని అభిమానులు కోరుకుంటారు.
కాగా, పాక్ తో పోరులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కేవలం ఒక్కడే స్పిన్నర్ తో బరిలోకి దిగుతోంది. కానీ, టీమిండియా మాత్రం ఐదుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. ఇక, మ్యాచ్ జరిగే పిచ్ ను చూస్తే.. స్పిన్ పిచ్ లా ఉంది.
ఐదుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు రాగా.. తన నిర్ణయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ సమర్ధించుకున్నారు. తాను తీసుకున్న ఐదుగురు స్పిన్నర్లలో ముగ్గురు ఆల్ రౌండర్లు అని, వారి వల్ల జట్టుకి మరింత బలం వస్తుందని రోహిత్ శర్మ చెబుతున్నాడు.
Also Read : ఇండియా vs పాక్ మ్యాచ్ లో పూనకాలేనా? విరాట్ కోహ్లీ ట్రాక్ రికార్డు చూస్తే.. ఇప్పటికీ అదే హయ్యస్ట్..
వరుణ్ చక్రవర్తి, కుల్ దీప్ యాదవ్ లు మాత్రమే స్పెషలిస్ట్ స్పిన్నర్లు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్లు అని వివరించాడు. ఇక పేస్ బౌలింగ్ విషయానికి వస్తే ముగ్గురు పేసర్లు ఉన్నారు. మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా. మిడిల్ ఓవర్లలో సపోర్ట్ చేసేందుకు హార్దిక్ పాండ్యా ఎలాగూ ఉన్నాడు.
”ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. మిగతా ముగ్గురు ఆల్ రౌండర్లు. కాబట్టి నేను వారిని ఐదుగురు స్పిన్నర్లుగా చూడటం లేదు. ఆ ముగ్గురు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేయగలరు. మిగతా టీమ్స్ లో ఫాస్ట్ బౌలర్లు ఆల్ రౌండర్లు. కాబట్టి ఆరుగురు ఫాస్ట్ బౌలర్లను తీసుకున్నామని వారు చెప్పొచ్చు. అది మంచిదే. కానీ, స్పిన్ మా బలం” అని స్పిన్నర్లను ఎక్కువగా ఎందుకు తీసుకున్నారన్న మీడియా ప్రశ్నకు బదులిచ్చాడు రోహిత్ శర్మ.
”జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మా జట్టుకు అదనపు బలం. కేవలం ఒక స్కిల్ ఉన్న ప్లేయర్ల కంటే రెండు స్కిల్స్ ఉన్న ప్లేయర్లను తీసుకోవడానికి కారణం అదే” అని రోహిత్ శర్మ వివరించాడు.