Danish Kaneria : పాక్ ప్రధాని, ఉప ప్రధానిని తిట్టిపోస్తున్న ఆ దేశ మాజీ క్రికెటర్.. ఉగ్రవాదులని సపోర్ట్ చేస్తారా అంటూ ఇచ్చిపడేసిన కనేరియా..

Former Pakistani Cricketer Danish Kaneria Slams pak deputy pm
జమ్మూకశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ స్పందిస్తూ ఉగ్రవాదులను స్వాత్రంత్య సమరయోదులు అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇషాక్ వ్యాఖ్యలపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా మండిపడ్డాడు.
‘ఉగ్రవాదులను పాక్ ఉప ప్రధాని స్వయంగా స్వాతంత్ర్య సమరయోధులు అని పిలుస్తున్నారు. ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు. ఇది అవమానకరమే కాదు ఉగ్రవాదానికి మేం మద్దతు ఇస్తున్నాం, ప్రోత్సహిస్తున్నాం అంటూ బహిరంగంగా అంగీకరించినట్లే అవుతుంది. ‘అని డానిష్ కనేరియా సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
CSK vs SRH : సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు.. ఆర్‌సీబీని ఫాలో కండి..
When the Deputy Prime Minister of Pakistan calls terrorists “freedom fighters,” it’s not just a disgrace — it’s an open admission of state-sponsored terrorism. pic.twitter.com/QlS1UDzq20
— Danish Kaneria (@DanishKaneria61) April 24, 2025
ఇక్కడ తాను పాక్ లేదా దేశ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదన్నాడు. ఉగ్రవాదం చేతిలో పాక్ తీవ్రంగా బాధపడుతోందని చెప్పుకొచ్చాడు. శాంతి కోసం నిలబడే నాయకత్వం అవసరం ఉందన్నాడు. తాను హిందువును అయిన కారణంగా తనను సహచర క్రికెటర్లు వేరుగా చూస్తూ హేళన చేస్తూ ఇబ్బందులు పెట్టేవారని తెలిపాడు. తాను ఎప్పుడైనా సరే మానవత్వం, వాస్తవం వైపే నిలబడతానని చెప్పుకొచ్చాడు.
అంతకముందు ఉగ్రదాడి దాడి పై పాక్ ప్రధాని స్పందించకపోవడం పైనా విమర్శలు గుప్పించాడు. దాడిలో పాక్ హస్తం లేకపోతే.. ప్రభుత్వం, పాక్ ప్రధాని షరీప్ ఎందుకు వెంటనే ఈ దాడిని ఖండించలేదని ప్రశ్నించాడు.
పాక్ తరుపున కనేరియా.. 61 టెస్టులు, 18 వన్డేలు ఆడిన ఆడాడు. టెస్టుల్లో 261, వన్డేల్లో 15 వికెట్లు తీశాడు.