SRH : ప్లే ఆఫ్స్‌కు వెళ్లేందుకు సన్‌రైజర్స్‌కు ఇంకా ఛాన్స్ ఉంది.. చెన్నై గెలిస్తే ఏం జరుగుతుందంటే..
సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆ జట్టు 8 మ్యాచ్‌లు ఆడింది. 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. రెండు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు ఉండగా, నెట్‌రన్‌రేట్ -1.361గా ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉంది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగానే ఉన్నాయి.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ మరో 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ ఆరు మ్యాచ్‌ల్లోనూ సన్ రైజర్స్ విజయం సాధించాలి. గెలవడంతో పాటు నెట్‌రన్‌రేట్‌ను మెరుగు పరచుకోవాల్సి ఉంది. అప్పుడు ఆ జట్టు ఖాతాలో 16 పాయింట్లు చేరుతాయి. అయినప్పటికి ఎస్ఆర్‌హెచ్ నేరుగా ప్లేఆప్స్‌లో అడుగుపెట్టే అవకాశం లేదు. మిగిలిన సమీకరణాలు కలిసి రావాలి. అప్పుడు నెట్‌రన్‌రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది.
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇప్పటి వరకు చెన్నై జట్టు 8 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో గెలవగా మరో 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు ఉండగా.. నెట్‌రన్‌రేట్ -1.392గా ఉంది. పాయింట్ల పట్టికలో పదో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే మరో 6 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సి ఉంది. ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినా కూడా ఇంటి ముఖం పట్టాల్సి ఉంది.
కాగా.. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నేడు (ఏప్రిల్ 25న) చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండనుండగా, ఓడిపోయిన జట్టు ఇంటి ముఖం పట్టనుంది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమిస్తుంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
హెడ్ టు హెడ్..
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ముఖాముఖిగా 21 సందర్భాల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై ఆధిక్యంలో ఉంది. 15 సార్లు చెన్నై విజేతగా నిలవగా, 6 సార్లు మాత్రమే హైదరాబాద్ విజయం సాధించింది.
Virat Kohli : చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ఆటగాడు ఇతడే..