CSK vs SRH : స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నై కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఆర్‌సీబీని ఫాలో కండి..

స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

CSK vs SRH : స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నై కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఆర్‌సీబీని ఫాలో కండి..

Stephen Fleming Advices Team To Follow RCB IPL 2024 Style To Reach Playoffs

Updated On : April 25, 2025 / 12:45 PM IST

‘మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో అన్ని గెలుస్తామనే న‌మ్మ‌కం ఉంది. ఇలా చెబుతుంటే కొంద‌రు న‌వ్వుతార‌ని తెలుసు. కానీ ఆర్‌సీబీ గ‌త సీజ‌న్‌లో ఇలా చేసి చూపించింది. కాబ‌ట్టి మాకు ఇంకా అవ‌కాశం ఉంది. ఆట‌గాళ్లు మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసి జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించాలి. ఒక‌వేళ అలాజ‌ర‌గ‌క‌పోతే పేల‌వ సీజ‌న్ మ‌రో ర‌కంగా స‌ద్వినియోగం చేసుకుంటాం.’ అని ఫ్లెమింగ్ చెప్పాడు.

Ishan Kishan : మొన్న‌టిలా చెయ్య‌కురా అయ్యా.. 11 కోట్లు పెట్టారు.. చెన్న‌తో మ్యాచ్‌కు ముందు ఇషాన్‌కిష‌న్‌కు విజ్ఞ‌ప్తులు

‘ఇలాంటి ప‌రిస్థితులు గతంలోనూ ఎదురు అయ్యాయి. ఆ త‌రువాత రెట్టించిన ఉత్సాహంతో ఆ మ‌రుస‌టి సంవ‌త్స‌రం విజేత‌గా నిలిచాం. కాబ‌ట్టి ఇప్పుడు ఏం చేయాల‌నేదానిపై దృష్టి పెట్టాం. ఎలా ముందుకు సాగాలా మాకు బాగా తెలుసు. ఏ మ్యాచ్‌ను కూడా తేలిక‌గా తీసుకోబోము. ప్ర‌తి మ్యాచ్‌లోనూ 100 శాతం ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చేందుకు జ‌ట్టు ప్ర‌య‌త్సిస్తుంది.’ అని అని ఫ్లెమింగ్ అన్నాడు.