French Open: జకోవిచ్‌కు షాక్.. సెమీస్‌లోకి నాదల్

ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో వరల్డ్ నెం.1 ప్లేయర్ జకోవిచ్‌కు రఫెల్‌ నాదల్‌ షాకిచ్చాడు. జకోవిచ్‌ను 6-2, 4-6, 6-2, 7-6తో ఓడించి సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు రఫెల్ నాదల్.

French Open: జకోవిచ్‌కు షాక్.. సెమీస్‌లోకి నాదల్

French Open

Updated On : June 1, 2022 / 8:20 AM IST

French Open: ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో వరల్డ్ నెం.1 ప్లేయర్ జకోవిచ్‌కు రఫెల్‌ నాదల్‌ షాకిచ్చాడు. జకోవిచ్‌ను 6-2, 4-6, 6-2, 7-6తో ఓడించి సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు రఫెల్ నాదల్.

మ్యాచ్‌ తొలిసెట్‌లో నాదల్‌ తొలిసెట్‌ను కైవసం చేసుకోగా.. రెండో సెట్‌లో జకోవిచ్‌ రాణించాడు. ఆ తర్వాత పుంజుకున్న నాదల్‌ వరుస రెండు సెట్లను సాధించి సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. దీంతో 21వ గ్రాండ్‌ స్లామ్‌ను ఖాతాలో వేసుకోవాలన్న జకోవిచ్‌ ఆశలు నీరుగారాయి.

13 సార్లు వరల్డ్‌ చాంపియన్‌ ట్రోఫీ దక్కించుకున్న నాదల్‌.. ఆదివారం జరిగే ఫైనల్స్‌లో చోటు దక్కించుకోవాలంటే జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో తలపడాల్సి ఉంది.

Read Also: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత జకోవిచ్

జకోవిచ్.. ప్రస్తుతం రోజర్‌ ఫెదరర్‌తో సమానంగా 20 గ్రాండ్‌ స్లామ్‌ను సాధించాడు. వీరిద్దరికంటే రఫెల్‌ నాదల్‌ 21 గ్రాండ్‌ స్లామ్స్‌ను కైవసం చేసుకున్నాడు. గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ను నాదల్‌ను ఓడించి జొకోవిచ్‌ను ఓడించి టైటిల్‌ను సాధించిన విషయం తెలిసిందే.

కింగ్‌ ఆఫ్‌ క్లే నాదల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ను అత్యధిక సార్లు గెలుచుకున్న ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకు 13 ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్స్‌ను సాధించి, కేవలం 3సార్లు మాత్రమే ఓటమికి గురయ్యాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను నాదల్ కైవసం చేసుకున్నాడు.