న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా ఓటమి.. మూడో టెస్టు మ్యాచ్‌పై గంభీర్ కీలక వ్యాఖ్యలు

న్యూజిలాండ్‌తో ఓటమి టీమిండియాను బాధిస్తోందని చెప్పారు.

న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా ఓటమి.. మూడో టెస్టు మ్యాచ్‌పై గంభీర్ కీలక వ్యాఖ్యలు

Updated On : October 31, 2024 / 6:06 PM IST

భారత్‌-న్యూజిలాండ్ మధ్య శుక్రవారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా కనీసం మూడో టెస్టులో గెలుస్తుందా అన్న సందేహాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. మూడో టెస్ట్‌ మ్యాచ్‌ గురించి టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్‌ కూడా ఫ్యాన్స్‌ హర్ట్‌ అయ్యేలా మాట్లాడడం గమనార్హం.

తాజాగా గౌతం గంభీర్‌ మాట్లాడుతూ… సానుకూల పరిస్థితులే ఉంటాయని తాను చెప్పలేనని అన్నారు. ఇలా చెబితే హర్ట్ అవుతామని, అయినా మనల్ని మరింత మెరుగ్గా చేస్తుందని చెప్పారు. న్యూజిలాండ్‌తో ఓటమి టీమిండియాను బాధిస్తోందని, అయినప్పటికీ భవిష్యత్తులో రాణించడానికి ఈ అనుభవం బాగా ఉపయోగపడుతుందని అన్నారు.

ఫైనల్‌ మ్యాచులో కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కుతుందన్న ప్రచారాన్ని కూడా ఆయన కొట్టిపారేశారు. కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే పరిస్థితిలో ప్రస్తుతం లేమని అన్నారు. హర్షిత్ రాణా స్క్వాడ్‌లో లేడని, ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమయ్యేందుకే అతను ఇక్కడికి వచ్చానని బ్యాటింగ్‌ కోచ్‌ అభిషేక్ నాయర్ కూడా నిన్న స్పష్టం చేశారని గంభీర్‌ అన్నారు.

ఇక ఐపీఎల్ రిటెన్షన్ గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన పని లేదని చెప్పారు. ప్రస్తుతం టెస్టు మ్యాచ్‌పైనే దృష్టి పెట్టామని తెలిపారు. టెస్ట్ క్రికెట్‌ను టెస్ట్ క్రికెట్‌లాగే ఆడాలని గౌతం గంభీర్ చెప్పారు. ఒక రోజు ఆటలో 400 పరుగులు సాధించాలని అనుకుంటే, అందుకు తగ్గట్లు ఆడాలని అన్నారు.

“పూర్తిస్థాయి క్రికెటర్ అంటే అన్ని పరిస్థితులనూ సమానంగా స్వీకరించగలిగి ఆడే క్రికెటర్‌ అని చెప్పారు. విజయవంతంగా స్వీకరించగల వ్యక్తి. కేవలం స్టాండ్‌లను కొట్టడం మాత్రమే కాదు, స్ట్రైక్‌ని విజయవంతంగా తిప్పడం కూడా” అని అతను చెప్పాడు.

IPL 2025: ఎంఎస్ ధోనీ స్థానంలో రిషబ్ పంత్‌.. సీఎస్‌కే యాజమాన్యం కీలక నిర్ణయం..!