IPL 2025: ఎంఎస్ ధోనీ స్థానంలో రిషబ్ పంత్‌.. సీఎస్‌కే యాజమాన్యం కీలక నిర్ణయం..!

ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వేలంలో రిషబ్ పంత్ ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైందట.

IPL 2025: ఎంఎస్ ధోనీ స్థానంలో రిషబ్ పంత్‌.. సీఎస్‌కే యాజమాన్యం కీలక నిర్ణయం..!

Rishabh Pant and MS Dhoni

Updated On : October 31, 2024 / 12:23 PM IST

IPL Retention 2025: ఐపీఎల్ 2025 రిటెన్షన్, రైటు టు మ్యాచ్ ఆప్షన్లను ఫ్రాంచైజీలు ఎలా వినియోగించుకుంటాయనే అంశం ఆసక్తిని రేపుతోంది. ఆయా ప్రాంచైజీలు ఎవరిని జట్టులో ఉంచుకుంటాయి.. ఎవరిని వేలానికి విడుదల చేస్తాయనే విషయంపై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే, ఆయా ప్రాంఛైజీలు తమ జాబితాలను ఐపీఎల్ నిర్వాహకులకు అందజేసేందుకు ఇవాళ (గురువారం) సాయంత్రం 5గంటల వరకే అవకాశం ఉంది. దీంతో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ పైనే అందరి దృష్టి ఉంది. రిషబ్ పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో సీకేఎస్ జట్టు పంత్ ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు షురూ చేసినట్లు ఐపీఎల్ వర్గాల నుంచి సమాచారం.

Also Read: IPL 2025: ఆర్సీబీ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం

ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం వేలంలో రిషబ్ పంత్ ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైందట. ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రకారం.. సీఎస్కే జట్టు రవీంద్ర జడేజా రిటెన్షన్ పై ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదు. సీఎస్కే ప్రణాళికలో భాగంగా రవీంద్ర జడేజాను వేలంలోకి విడుదల చేసే అవకాశాన్ని జట్టు మేనేజ్ మెంట్ పరిశీలిస్తుంది. తద్వారా రిషబ్ పంత్ ను కొనుగోలు చేయాలని భావిస్తుందట. ఇందుకు ప్రధాన కారణం ఉంది. మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ కెరీర్ ముగింపు దశకు చేరుకుంది. ఫిట్ నెస్ సమస్యలతో సతమతం అవుతున్నాడు. ఇన్నాళ్లు ధోనీ అన్నీతానై జట్టును ముందుండి నడిపించాడు. ధోనీ స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యం పంత్ కు ఉందని సీఎస్కే యాజమాన్యం భావిస్తున్నట్లుగా తెలిసింది.

Also Read : Harshit Rana : కివీస్‌తో మూడో టెస్టుకు హ‌ర్షిత్ రాణా.. క్లారిటీ ఇచ్చిన అభిషేక్ నాయ‌ర్‌

వికెట్ కీపర్, బ్యాటర్ గా రిషబ్ పంత్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)కు కీలక ప్లేయర్ గా ఉన్నాడు. అయితే, పంత్ ను డీసీ వేలానికి వదిలేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే సీఎస్కే అధిక మొత్తాన్ని వెచ్చించి పంత్ ను కొనుగోలు చేయాలని భావిస్తుంది. ఈ క్రమంలో రూ. 20కోట్లుకుపైగా పంత్ కోసం వెచ్చించవచ్చునని సమాచారం. ప్రస్తుతం సీఎస్కే ప్రాంఛైజీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, మతీషా పతిరానా, ధోనీ (అన్ క్వాప్డ్ ప్లేయర్) కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. జట్టులో కీలక ఆల్ రౌండర్ జడేజాను వేలంలోకి విడుదల చేసే అవకాశాన్ని సీఎస్కే యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు సమాచారం. జడేజాను వేలంలోకి విడుదల చేసి.. రైట్ టు మ్యాచ్ కార్డు ను ఉపయోగించే ఆలోచన చేస్తుందట. సాయంత్రం వరకే సమయం ఉండటంతో.. పంత్ ను దక్కించుకోవాలన్న  సీఎస్కే యాజమాన్యం కోరిక నెరవేరుతుందో లేదో తెలిసిపోతుంది.