IPL 2022: లోగో రిలీజ్ చేసిన గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ లోగోను లాంచ్ చేసింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 వేలంలో అధికారికంగా పాల్గొన్న గుజరాత్ లోగోను లాంచ్ చేస్తూనే వర్చువల్ స్పేస్ ద్వారా ప్లేయర్లను..

Gujarath Titans
IPL 2022: ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ లోగోను లాంచ్ చేసింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 వేలంలో అధికారికంగా పాల్గొన్న గుజరాత్ లోగోను లాంచ్ చేస్తూనే వర్చువల్ స్పేస్ ద్వారా ముగ్గురు ప్లేయర్లను చూపించింది. బంగారపు వర్ణంలో, వైట్ అండ్ బ్లూ రంగుల్లో పిరమిడ్ షేప్ లో కనిపించింది లోగో.
మెటావర్స్ లో టైటాన్స్ డగౌట్ నుంచి లోగో లాంచ్ చేస్తున్నట్లుగా ఉన్న వీడియోను పోస్టు చేసింది గుజరాత్. డగౌట్ లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఆశిష్ నెహ్రా, శుబ్మన్ గిల్ నిల్చొని మాట్లాడుతూ లోగో లాంచ్ గురించి మాట్లాడుకుంటారు. ఆ మాటల తర్వాత లోగో లాంచ్ అవుతుండగా చిందులేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
మొత్తం రూ.5వేల 625కోట్లు కేటాయించి గుజరాత్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది సీవీసీ గ్రూప్. అత్యధిక గోల్స్ సాధించే దిశగా అడుగుపెడుతున్నామని చెబుతూ లోగోలో టైటాన్స్ ను హైలెట్ చేశారు.
Read Also: పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ పూర్తి జట్టు
మెగా వేలం నుంచి గుజరాత్ జట్టులోకి మొహమ్మద్ షమీ, జాసన్ రాయ్, లాకీ ఫెర్గ్యూసన్, లను కొనుగోలు చేసింది జట్టు. వారితో పాటు రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుబ్ మన్ గిల్ జట్టులో ఉన్నారు.