IPL 2023, GT vs LSG: అదరగొట్టిన గుజరాత్.. లక్నోపై ఘన విజయం
అహ్మదాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) అదరగొట్టింది. 56 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది

Gujarat Titans win (pic IPL Twitter)
IPL 2023, GT vs LSG: అహ్మదాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) అదరగొట్టింది. 56 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులకే పరిమితమైంది. లక్నో బ్యాటర్లలో క్వింటన్ డికాక్(70; 41 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టగా కైల్ మేయర్(48; 32బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. దీపక్ హుడా(11), స్టోయినిస్(4), నికోలస్ పూరన్(3), కృనాల్ పాండ్యా(0)లు విఫలం అయ్యారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ నాలుగు వికెట్లు తీయగా, మహ్మద్ షమీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ఒక్కొ వికెట్ పడగొట్టారు.
IPL 2023, GT vs LSG : లక్నో పై గుజరాత్ ఘన విజయం
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్( 94నాటౌట్; 51 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు), వృద్ధిమాన్ సాహా(81; 43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు) లు ధంచికొట్టగా హార్ధిక్ పాండ్యా(25; 15 బంతుల్లో 1 పోర్, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్(21 నాటౌట్; 12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.