Smriti Mandhana : నిజంగా ఇది ఎంతో ప్ర‌త్యేకం.. నా క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి

చైనాలోని హాంగ్‌జౌ న‌గ‌రంలో జ‌రుగుతున్న ప్ర‌తిష్టాత్మ‌క ఆసియా క్రీడ‌ల్లో (Asian Games) భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో శ్రీలంక‌ను ఓడించి స్వ‌ర్ణ ప‌త‌కాన్ని సొంతం చేసుకుంది.

Smriti Mandhana : నిజంగా ఇది ఎంతో ప్ర‌త్యేకం.. నా క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి

Smriti Mandhana

Tears in my eyes Smriti Mandhana : చైనాలోని హాంగ్‌జౌ న‌గ‌రంలో జ‌రుగుతున్న ప్ర‌తిష్టాత్మ‌క ఆసియా క్రీడ‌ల్లో (Asian Games) భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో శ్రీలంక‌ను ఓడించి స్వ‌ర్ణ ప‌త‌కాన్ని సొంతం చేసుకుంది. దీనిపై భార‌త ఓపెన‌ర్ స్మృతి మంధాన (Smriti Mandhana) మాట్లాడింది. ఇది ఎంతో ప్ర‌త్యేక‌మైన‌దని, గోల్డ్ మెడ‌ల్ గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్న‌ట్లు చెప్పింది. సంతోషంలో మాట‌లు రావ‌డం లేదంది. టోక్యోలో నీర‌జ్ చోప్రా స్వ‌ర్ణ ప‌త‌కం సాధించిన‌ప్పుడు తాము టీవీల్లో చూసిన‌ట్లు గుర్తు చేసుకుంది. స్వ‌ర్ణ ప‌త‌కాన్ని అందుకున్న‌ప్పుడు జాతీయ గీతం ఆల‌పిస్తుండ‌గా జాతీయ ప‌తాకం పైకి ఎగిరినప్పుడు త‌న క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయంది. అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చి దేశానికి ప‌త‌కం అందించ‌డం ప‌ట్ల చాలా సంతోషంగా ఉన్న‌ట్లు తెలిపింది.

ఫైన‌ల్ మ్యాచ్‌లో టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌డం ప‌ట్ల మాట్లాడుతూ..గోల్డ్ ఈజ్ గోల్డ్ అని ఈ రోజు బెస్ట్ ఇచ్చినందుకు నిజంగా సంతోషంగా ఉన్న‌ట్లు చెప్పింది. “ఇది చాలా ప్రత్యేకం. నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచినప్పుడు టీవీలో చూశాం. జాతీయ గీతం ప్లే అవుతుండ‌గా, భారతదేశం యొక్క జాతీయ జెండా పైకి వెళ్లింది. ఇది చాలా ప్రత్యేకమైనదని నేను భావిస్తున్నాను. ఆ స‌మ‌యంలో ఆనంద బాష్పాలు వ‌చ్చాయి. ఇప్పుడు కూడా దాదాపుగా అలాగే జ‌రిగింది. భార‌త‌దేశ ప‌త‌కాల సంఖ్య‌ను పెంచ‌డంలో మా స‌హ‌కారం ఉండ‌డం ఆనందంగా ఉంది. ఏదీఏమైన‌ప్ప‌టికీ గోల్డ్ ఈజ్ గోల్డ్.. .ఈరోజు మా బెస్ట్ ఇచ్చినందుకు నిజంగా సంతోషం.” అని స్మృతి మంధాన అంది.

IND vs AUS : ఇండోర్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం.. మైదాన సిబ్బందికి రూ.11ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీ.. ఎందుకో తెలుసా..?

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 116 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో స్మృతి మంధాన (46), జెమీమా రోడ్రిగ్స్ (42) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్ద‌రు మిన‌హా మిగిలిన వారు ఎవ్వ‌రు కూడా రెండు అంకెల స్కోరు సాధించ‌లేక‌పోయారు. ష‌ఫాలీ వ‌ర్మ (9), రిచా ఘోష్ (9), హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ (2)లు విఫ‌లం అయ్యారు. లంక బౌల‌ర్ల‌లో ఉదేశిక ప్రబోధని, సుగందిక కుమారి, ఇనోక రణవీర త‌లా రెండు వికెట్లు తీశారు.

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో శ్రీలంక 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 97 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. హాసిని పెరీరా (25), నీలాక్షి డి సిల్వా (23) రాణించినా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో 19 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. 18 ఏళ్ల పేసర్ టిటాస్ సాధు ఆరు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి మూడు కీల‌క వికెట్లు తీసి భార‌త విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది. రాజేశ్వరి గైక్వాడ్ రెండు, పూజా వస్త్రాకర్‌, దీప్తి శర్మ, దేవిక వైద్య తలా ఓ వికెట్ పడగొట్టారు.

IND vs AUS 3rd ODI: మూడో వ‌న్డేకు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్‌