James Vince : ఒక మ్యాచ్‌లో సెంచరీ, మరో మ్యాచ్‌లో అర్ధసెంచరీ.. రెండూ ఒకరోజు సాధించాడు

James Vince : ఒక మ్యాచ్‌లో సెంచరీ, మరో మ్యాచ్‌లో అర్ధసెంచరీ.. రెండూ ఒకరోజు సాధించాడు

James Vince

Updated On : July 18, 2021 / 1:20 PM IST

County Cricket Club : టీ20 బ్లాస్ట్‌ 2021లో భాగంగా హాంప్‌షైర్‌ ఆటగాడు కెప్టెన్‌ జేమ్స్‌ విన్స్‌ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఒకే రోజు రెండు వేర్వేరు మ్యాచ్ లలో సెంచరీ, అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ససెక్స్‌, ఈసెక్స్‌తో జరిగిన మ్యాచ్ లలో హాంప్‌షైర్‌ కెప్టెన్‌ జేమ్స్‌ విన్స్‌ ఈ ఫీట్ సాధించారు. ఈ రెండు మ్యాచ్ లలో హాంప్‌షైర్‌ విజయం సాధించింది.

మొదట ససెక్స్‌ తో మ్యాచ్ జరిగింది.. ఈ మ్యాచ్ లో 59 బంతులు ఎదురుకున్న జేమ్స్‌ విన్స్‌ 102 పరుగులు చేశారు. వీటిల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 16 పరుగులు చేస్తే మ్యాచ్ గెలుస్తామన్న సమయంలో జేమ్స్‌ విన్స్‌.. వెనుదిరిగాడు. ఆ తర్వాత జో వెథర్లీ 24 నాటౌట్‌, లూయిస్‌ మెక్‌మనస్‌ 3 హాంప్‌షైర్‌ జట్టును విజయతీరాలకు చేర్చారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ససెక్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. రవి బొపారా 62, లూక్‌ రైట్‌ 54 పరుగులు చేశారు.

184 పరుగుల నిర్ణిత లక్ష్యంతో బరిలోకి దిగిన హాంప్‌షైర్‌, జేమ్స్‌ విన్స్‌ విధ్వంసకర బ్యాటింగ్ తో అలవోకగా విజయం సాధించింది. అనంతరం ఈసెక్స్ తో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్‌ 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. ఇందులో జేమ్స్‌ విన్స్‌ 63 పరుగులు చేయగా.. డీ ఆర్సీ షార్ట్‌ 30, గ్రాండ్‌హోమ్‌ 32 పరుగులు సాధించారు. ఇక 172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన ఈసెక్స్ 153 పరుగులకే ఆలౌట్ అయింది.

కాగా ఈ వారంలో ఆడిన నాలుగు మ్యాచ్ లలో జేమ్స్ విన్స్ రెండు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు పూర్తి చేశారు.