Pakistan : భళా పాక్.. ఇలాంటివి మీకే సాధ్యం.. ఆడియో లేకుండా క్షమాపణ వీడియో..! అడ్డంగా దొరికిపోయారు ?
తాము చెప్పినది నిజం అని నిరూపించుకునేందుకు తమ అనుకూల సోషల్ మీడియాలో పీసీబీ ఓ వీడియోను లీక్ చేయించింది (Pakistan).

Handshake row Pakistan leaks mute video claiming Andy Pycroft apologised to Salman Agha
Pakistan : ఆసియాకప్ 2025లో బుధవారం యూఏఈతో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ ఈ టోర్నీ నుంచి బాయ్‌కాట్ చేస్తామంటూ ప్రగల్భాలు పలికింది. కొంత హైడ్రామా మధ్య మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ క్షమాపణలు చెప్పడంతో తాము వెనక్కి తగ్గినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది. తాము చెప్పినది నిజం అని నిరూపించుకునేందుకు తమ అనుకూల సోషల్ మీడియాలో పీసీబీ ఓ వీడియోను లీక్ చేయించింది.
ఈ వీడియోలో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా, ప్రధాన కోచ్ మైక్ హెస్సన్, పీసీబీ మేనేజర్‌తో పాటు రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఉన్నారు. వారితో ఆండ్రీ మాట్లాడడం కనిపిస్తుంది. ఈ వీడియో మ్యూట్‌గా ఉంది. వీడియోలో ఆండీ క్షమాపణలు చెబుతున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. ఆ రోజు జరిగిన ఘటనను అతడు వివరిస్తున్నట్లుగా మాత్రమే కనిపించింది. ఈ వీడియో వైరల్‌గా మారగా నెట్టింట పాక్ మరోసారి ట్రోలింగ్‌కు గురవుతోంది.
SL vs AFG : అఫ్గాన్‌కు లంక కష్టాలు..! నాగిని డ్యాన్స్ చేసేందుకు బంగ్లాదేశ్ ఎదురుచూపులు..!
🚨 Video clip of match referee Andy Pycroft apologising to Pakistan’s manager and captain. pic.twitter.com/VnBKM6ePBa
— Ihtisham Ul Haq (@iihtishamm) September 17, 2025
ఆడియో లేకుండా వీడియో రిలీజ్ చేసి క్షమాపణలు అంటూ చెప్పడం పాక్‌కే సాధ్యం అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. వాళ్లు యుద్ధాలు గెలిచినట్లే.. ఇలా ఆడియో లేని వీడియోలను వారు మాత్రమే వినగలరు అంటూ సెటైర్లు వేస్తున్నారు.
కరచాలన వివాదం..
భారత్, పాక్ (Pakistan) జట్లు గత ఆదివారం (సెప్టెంబర్ 14న) దుబాయ్ వేదికగా తలపడ్డాయి. పహల్గాం దాడి అనంతరం పరిణామాల నేపథ్యంలో ఈ మ్యాచ్ సమయంలో టాస్ వేసిన సందర్భంలో టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాతో కరచాలనం చేయలేదు. ఆ తరువాత మ్యాచ్ అనంతరం కూడా భారత ఆటగాళ్లు.. కరచాలనం కోసం వేచి చూస్తున్న పాక్ ప్లేయర్ల వద్దకు వెళ్లలేదు.
Muhammad Waseem : పాక్ పై అందుకే ఓడిపోయాం.. యూఏఈ కెప్టెన్ వసీం కామెంట్స్ వైరల్..
దీన్ని పాక్ ఆటగాళ్లు అవమానంగా భావించారు. దీంతో ప్రెజెంటేషన్ కార్యక్రమానికి, విలేకరుల సమావేశానికి పాక్ కెప్టెన్ దూరంగా ఉన్నాడు. అంతేకాదు.. టాస్ సందర్భంగా భారత కెప్టెన్‌తో కరచాలనం చేయవద్దు అని రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ చెప్పినట్లుగా అతడు తెలిపాడు. దీంతో రిఫరీ ఆండీ తప్పుచేశాడని, అతడిని విధుల నుంచి తప్పించాలని ఐసీసీని పీసీబీ డిమాండ్ చేసింది.
ఇందుకు ఐసీసీ అంగీకరించకపోవడంతో బాయ్‌కాట్ చేస్తామంటూ బెదిరించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే యూఏఈతో మ్యాచ్‌కు ముందు కాస్త హైడ్రామా జరిగింది. చివరికి రిఫరీ క్షమాపణలు చెప్పడంతోనే బాయ్‌కాట్ నిర్ణయంపై వెనక్కి తగ్గామని చెబుతూ మ్యాచ్ ఆడింది. అయితే.. దీనిపై అటు ఐసీసీ గానీ, ఇటు రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ గానీ అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. దీంతో తాము చెప్పింది నిజం అని నమ్మించేందుకు పీసీబీ.. తమ అనుకూల సోషల్ మీడియాలో వీడియోను లీక్ చేయించి, అడ్డంగా దొరికిపోయిందని అంటున్నారు.