హ్యాట్రిక్ సెంచరీలతో చరిత్ర సృష్టించిన హనుమవిహారీ

భారత బ్యాట్స్‌మన్ హనుమవిహారీ సెంచరీలతో చెలరేగాడు. ఇరానీ కప్ చరిత్రలోనే ఎవ్వరూ చేయలేని విధంగా వరుస ఇన్నింగ్స్‌లలో హ్యాట్రిక్ సెంచరీలను నమోదు చేసి రికార్డు సృష్టించాడు. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్వితీయమైన ప్రదర్శన చేశాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ లంచ్ విరామానికి ముందు ఇరానీ కప్‌లో మూడో సెంచరీలు పూర్తి చేసుకున్నాడు.
రెస్ట్ ఆఫ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 114 పరుగులు నమోదు చేయగా రెండో ఇన్నింగ్స్‌లో 183పరుగులు చేశాడు. రెండు ఇన్నింగ్స్ లలోనూ జట్టు మొత్తం చేసింది 755 పరుగులు అయితే వాటిలో విహారీ ఒక్కడే 297 పరుగులు చేయగలిగాడు. గతేడాది విదర్భ జట్టుతో జరిగిన మ్యాచ్ ఆఖరి ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో చెలరేగాడు.
2011లో ప్రతి ఇన్నింగ్స్‌లో సెంచరీలు నమోదు చేసిన శిఖర్ ధావన్ తర్వాత మళ్లీ అలాంటి ఫీట్ సాధించింది హనుమవిహారీనే. ధావన్ ఈ ఫీట్‌ను రాజస్థాన్ వేదికగా రంజీ ట్రోఫీ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కనబరిచాడు. ఈ ఘనతను స్వయంగా బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసి సత్కరించింది.
Back to back tons for @Hanumavihari. Getting the run registers ringing and how! ??? #IraniCup #ROIvVID pic.twitter.com/Q9pjezMlTd
— BCCI Domestic (@BCCIdomestic) February 15, 2019
Also Read : 3 నెలల తర్వాత మళ్లీ మైదానంలోకి పృథ్వీ షా
Also Read : షాక్ నుంచి తేరుకుని విషాదంతో కోహ్లీ ట్వీట్