Hardik Pandya : ‘కప్‌ను ఇంటికి తీసుకువద్దాం’.. టీమిండియాకు హార్దిక్ పాండ్యా స్పెషల్ మెసేజ్..!
Hardik Pandya : అందరి చూపు ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌పైనే.. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ ఆఖరి పోరులో కప్ ఎవరి సొంతం అవుతుంది? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా అదే ఉత్సాహంతో టీమిండియాకు స్పెషల్ మెసేజ్ పంపాడు.

Hardik Pandya sends special message to Team India ahead of World Cup 2023 final vs Australia
Hardik Pandya : క్రికెట్ అభిమానులంతా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 19 (ఆదివారం) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ తుది పోరులో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ క్రమంలో భారతీయ క్రికెట్ అభిమానులతో పాటు పలువురు క్రికెటర్లు కూడా టీమిండియా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా టీమిండియాకు తమ విషెస్ తెలియజేస్తున్నారు. అయితే, గాయంతో ఆటకు దూరమైన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా భారత జట్టుకు శుభాకాంక్షలు చెబుతూ ప్రత్యేక సందేశాన్ని ఇన్‌స్టా వేదికగా పోస్టు చేశాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే, ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్‌పై గెలిచి కప్‌తోనే టీమిండియా ఇంటికి తిరిగిరావాలంటూ ఆకాంక్షిస్తూ వీడియోను పోస్టు చేశాడు.
Read Also : World Cup Final : వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆటకు తోడు పాట జోష్ కూడా .. ముగింపు వేడుకలకు బీసీసీఐ భారీ ఏర్పాట్లు
ట్రోఫీని ముద్దాడాలి భయ్యా.. :
‘నేను ఈ జట్టు విషయంలో గర్వంగా ఉండలేను. ఇప్పటివరకు చేసిన ప్రతిదీ ఎన్నో ఏళ్ల కృషికి నిదర్శనం. ఇప్పుడు మరో విజయానికి ఒక అడుగు దూరంలో ఉన్నాం. చిన్నప్పటి నుంచి ఎన్నో కలలుగన్న మనకోసమే కాకుండా మన వెనుక ఉన్న బిలియన్ల మంది క్రికెట్ ప్రేమికుల కోసం వరల్డ్ కప్ ట్రోఫీని ఎత్తి ముద్దాడాల్సిందే. ఇప్పుడు అదే ఉత్సాహంతో తుది పోరులో గెలిచి కప్పును ఇంటికి తెచ్చుకుందాం. జై హింద్.. అంటూ పాండ్యా పోస్టు చేశాడు. ఇప్పుడా పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Hardik Pandya special message
ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాతో ఆదివారం జరగబోయే ఫైనల్లో తన సత్తా చాటాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. వరల్డ్ కప్ టోర్నీలో మొత్తం 10 గేమ్‌లు గెలిచిన భారత్ ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత్ వరల్డ్ కప్ టైటిల్ కోసం ఆరాటపడుతోంది. ఆరంభం నుంచి ఫైనల్ వరకు దూసుకొచ్చిన టీమిండియాపై అనేక అంచనాలు నెలకొన్నాయి.
భారత్ చివరిసారిగా 2011లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత మళ్లీ ప్రపంచకప్ అందుకోలేదు. ఈసారైనా భారత జట్టు ఆసీస్‌ను మట్టికరిపించి ప్రపంచ కప్ సొంతం చేసుకుంటుందా లేదా అనే ఆసక్తి నెలకొంది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఎలా ఆడుతుంది అనేదానిపై కూడా ఉత్కంఠ నెలకొంది.
View this post on Instagram