World Cup Final : ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్లు అందరికి ఆహ్వానం.. ప్రత్యేక బ్లేజర్.. ఇమ్రాన్‌ఖాన్ మాత్రం..
World Cup Final 2023 : వన్డే ప్రపంచకప్ 2023 ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఏర్పాట్లు చేస్తోంది.

World Cup winning captains
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ఈ మెగాటోర్నీ ముగియనుంది. ఈ నేథప్యంలో ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఏర్పాట్లు చేస్తోంది. ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.
ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ మరో నిర్ణయం తీసుకుందట. ఇప్పటి వరకు ప్రపంచకప్ లు గెలిచిన కెప్టెన్లు అందరినీ ఈ మ్యాచ్ చూసేందుకు ఆహ్వానాలు పంపిందట. అంతేకాదండోయ్ వీరందరికి ఓ ప్రత్యేకమైన బ్లేజర్ ఇవ్వనుందట. ఈ బ్లేజర్ వేసుకుని సదరు కెప్టెన్లు అందరూ మ్యాచ్‌ను చూసే ఏర్పాట్లు చేసింది.
విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్, కపిల్ దేవ్, అలన్ బోర్డర్, అర్జున రణతుంగ, స్టీవ్ వా, రికీ పాంటింగ్, మహేంద్రసింగ్ ధోనీ, మైఖేల్ క్లార్క్, ఇయాన్ మోర్గాన్ లు మ్యాచ్ చూసేందుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. పాకిస్థాన్ కు ప్రపంచకప్‌ను అందించిన ఇమ్రాన్ ఖాన్ మాత్రమే హాజరుకావడం లేదు. ఎందుకంటే అతడు ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కారణంగా అతడు రావడం లేదు.
ICC will arrange special blazers for previous World Cup winning captains.
– Imran Khan will continue to spend his time in prison. pic.twitter.com/YxwrBA4wQ3
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 17, 2023