హార్దిక్, ధావన్, భువీలు వచ్చేశారు.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లకు భారత జట్టిదే

హార్దిక్, ధావన్, భువీలు వచ్చేశారు.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లకు భారత జట్టిదే

Updated On : March 8, 2020 / 11:33 AM IST

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) దక్షిణాఫ్రికాతో ఆడనున్న భారత జట్టును ఆదివారం ప్రకటించింది. సొంతగడ్డపై మార్చి 12నుంచి మార్చి 18వరకూ ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. కోహ్లీ కెప్టెన్సీలో ఆడేందుకు 15మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు సునీల్ జోష్ సెలక్షన్ కమిటీ. దక్షిణాఫ్రికాతో జరగనున్న మ్యాచ్‌లకు హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్‌లు తిరిగి స్థానం దక్కించుకోనున్నారు. 

రెస్ట్‌లోనే రోహిత్
వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడేంత ఫిట్ అయినట్లు కనిపించడం లేదు. కాలి పిక్కల్లో గాయం కావడంతో సంవత్సరారంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20సిరీస్ అనంతరం టీమిండియా నుంచి విరామం తీసుకున్నాడు. ఇక రోహిత్ మార్చి 29 నుంచి మొదలుకానున్న ఐపీఎల్‌లోనే కనిపిస్తాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

పాండ్యా తిరిగొచ్చాడు:
అక్టోబరు 2019న వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్న హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్ లో ఆడేందుకు ఫిట్ నెస్ సాధించాడు. గతేడాది సెప్టెంబరులో బెంగళూరు వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ తర్వాత ఆడింది లేదు. డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్ ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకున్నాడు. 

భువీ ఈజ్ బ్యాక్:
భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.. తిరిగొచ్చేశాడు. షమీ రెస్ట్ లో ఉండటంతో న్యూజిలాండ్ టూర్‌కు అతని స్థానంలో బుమ్రా వెళ్లాడు. డిసెంబరు 2019లో వెస్టిండీస్ సిరీస్‌ తర్వాత భువీకి వచ్చిన కాల్ ఇదే. 

 

సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో ఆడనున్న భారత జట్టు ఇదే:
శిఖర్ ధావన్, పృథ్వీ షా, విరాట్ కోహ్లీ (సి), కేఎల్ రాహుల్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, శుభ్‌మన్ గిల్.