మరో వేదనలో హార్దిక్ పాండ్యా.. విడాకుల రూమర్స్‌పై కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్

Hardik Pandya: ఐపీఎల్ మ్యాచుల్లో ఇతర క్రికెటర్ల భార్యలు కనపడితే హార్దిక్ భార్య నటాసా స్టాంకోవిచ్‌ మాత్రం కనపడలేదు. దీంతో..

మరో వేదనలో హార్దిక్ పాండ్యా.. విడాకుల రూమర్స్‌పై కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్

Hardik Pandya

ఇప్పటికే ఐపీఎల్ 2024 నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించిన బాధలో ఉన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను మరో విషయం వేధిస్తోంది. 14 మ్యాచ్‌లలో కేవలం 4 మాత్రమే గెలిచి లీగ్ పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ముంబై ఇండియన్స్ నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు రకాల రూమర్స్ వస్తున్నాయి.

పాండ్యా తన భార్య నటాసా స్టాంకోవిచ్‌తో ఇప్పటికే విడిపోయారని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. నటాసా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి పాండ్యా అనే ఇంటిపేరును తీసివేసింది. ఇంతకు ముందు ఆమె పేరు నటాసా స్టాంకోవిక్ పాండ్యాగా కనపడేది.

ఇప్పుడు నటాసా స్టాంకోవిచ్‌గా మార్చుకుంది. ఐపీఎల్ మ్యాచుల్లో ఇతర క్రికెటర్ల భార్యలు కనపడితే హార్దిక్ భార్య నటాసా స్టాంకోవిచ్‌ మాత్రం కనపడలేదు. దీంతో అనుమానాలు రెట్టింపయ్యాయి. అంతేగాక, పాండ్యా భరణం కింద ఆస్తిలో 70 శాతం ఇవ్వాలని నటాసా డిమాండ్ చేసిందని ప్రచారం జరుగుతోంది.

దీంతో పాండ్యా ఆస్తి రూ. 91 కోట్లలో అతడు రూ.63 కోట్లు కోల్పోతాడని వదంతులు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా కూడా దీనికి ఒప్పుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ రూమర్లపై ఇంత వరకు హార్దిక్ పాండ్యా, నటాషా స్పందించలేదు.

హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి పరోక్షంగా నటాషా ఇటీవల పోస్టులు చేస్తోందంటూ నెటిజన్లు అంటున్నారు. అలాగే, ఇటీవల నటాషా బర్త్ డే సందర్భంగా హార్దిక్ పాండ్యా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టలేదు. కొడుకుతో ఉన్న ఫొటోలు మాత్రమే పోస్ట్ చేశాడు. ఆ తర్వాతి పోస్టులో ఒంటరిగా కనపడుతూ ప్రస్తుతం రీచార్జ్ అవుతున్నానని పేర్కొన్నాడు.

 

Also Read : ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌కు వ‌రుణుడు ఆటంకం క‌లిగిస్తాడా..? ఆదివారం చెన్నైలో వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే..?