Team India: ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా హవా మామూలుగా లేదు.. టాప్ 5లో ఏకంగా..!

అంతర్జాతీయ క్రికెట్ క్రీడలో భారత పురుషులు జట్టు జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది.

Team India: ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా హవా మామూలుగా లేదు.. టాప్ 5లో ఏకంగా..!

How team india sheer dominance in ICC rankings full details in Telugu (Photo: @BCCI)

Updated On : September 15, 2023 / 2:12 PM IST

Team India – ICC Ranks: ఇంటర్నేషనల్ క్రికెట్ లో (International Cricket) టీమిండియా దూసుకుపోతోంది. తాజాగా జరుగుతున్న ఆసియాకప్ టోర్నమెంట్ (Asia Cup 2023) టైటిల్ పోరుకు సిద్ధమైంది భారత మెన్స్ క్రికెట్ టీమ్. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకను ఓడించి టైటిల్ దక్కించుకోవాలని ఇండియా టీమ్ కసితో ఉంది. రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలోని టీమిండియా చెప్పుకోదగ్గ విజయాలతో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) ర్యాంకుల్లోనూ సత్తా చాటుతోంది.

తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో టీమిండియా సత్తా చాటింది. టీమ్, బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ విభాగాల్లో భారత్ తనదైన ముద్ర వేసింది. టాప్5లో ఓవరాల్ గా 11 ర్యాంకులు దక్కించుకుని ఆధిక్యం ప్రదర్శించింది. టెస్టులు, టీ20ల్లో నంబర్ వన్ టీమ్ గా టీమిండియా నిలిచింది. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు. టాప్10లో మిగతా భారత బ్యాటర్లు ఎవరూ లేరు. అయితే ఆల్ రౌండర్ లిస్ట్ లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) సెకండ్ ర్యాంక్ లో ఉన్నాడు.

Ravindra Jadeja, Kuldeep Yadav

Ravindra Jadeja, Kuldeep Yadav (Photo: @BCCI)

వన్డే బ్యాటింగ్ ర్యాకింగ్స్ టాప్10లో ముగ్గురు భారత బ్యాటర్లు చోటు సంపాదించారు. యంగ్ ప్లేయర్ శుభమాన్ గిల్ (Shubman Gill) సెకండ్ ర్యాంక్ దక్కించుకోగా.. విరాట్ కోహ్లి 8, రోహిత్ శర్మ 9 ర్యాంకుల్లో ఉన్నారు. ఇద్దరు భారత బౌలర్లు టాప్10లో ఉన్నారు. కుల్దీప్ యాదవ్ 7, మహ్మద్ షమీ 9 ర్యాంకు సొంతం చేసుకున్నారు. ఆల్ రౌండర్లలో హార్దిక్ పాండ్యా 6వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. వన్డే టీమ్ ర్యాంకింగ్స్ లో భారత్ సెకండ్ పొజిషన్ లో ఉంది.

Also Read: మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్న మహేంద్ర సింగ్ ధోని.. వీడియో వైరల్

ఇక టెస్టుల్లో చూసుకుంటే టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నంబర్ వన్ ర్యాంక్ లో కంటిన్యూ అవుతున్నాడు. రవీంద్ర జడేజా 2, జస్ప్రీత్ బుమ్రా 10వ ర్యాంకుల్లో ఉన్నారు. ఆల్ రౌండర్ విభాగంలో జడేజా,
అశ్విన్.. ఫస్ట్, సెకండ్ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. అక్షర్ పటేల్ 5వ ర్యాంకులో నిలిచాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ లో 10వ ర్యాంకు దక్కించుకున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ కలిపి టాప్10లో 15 ర్యాంకులు టీమిండియా ప్లేయర్లు కైవసం చేసుకోవడం విశేషం.

Also Read: రెండు జట్ల స్కోర్ సమం.. శ్రీలంక విజేతగా ఎలా అయింది? అసలు ఈ లెక్కేంటి!