NZ vs SL: శ్రీలంకపై న్యూజిలాండ్ గెలుపు.. సెమీస్ ఆశలు సజీవం
వన్డే ప్రపంచకప్ లో శ్రీలంకతో ఈరోజు జరుగుతున్న కీలక మ్యాచ్ లో న్యూజిలాండ్ తాడోపేడో తేల్చుకోనుంది.

New Zealand vs Sri Lanka
శ్రీలంకపై న్యూజిలాండ్ గెలుపు.. సెమీస్ ఆశలు సజీవం
శ్రీలంకపై న్యూజిలాండ్ వికెట్ల తేడాతో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
4వ వికెట్ నష్టపోయిన కివీస్
లక్ష్యాన్ని త్వరగా ఛేదించి రన్ రేటును మెరుగుపరుచుకోవాలనే క్రమంలో వేగంగా ఆడుతున్న న్యూజిలాండ్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. 145 పరుగుల వద్ద 4వ వికెట్ నష్టపోయింది. మార్క్ చాప్మన్(7) రనౌటయ్యాడు.
విలియమ్సన్ అవుట్.. మూడో వికెట్ డౌన్
130 పరుగుల వద్ద న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. కేన్ విలియమ్సన్ 14 పరుగులు చేసి మాథ్యూస్ బౌలింగ్ లో అవుటయ్యాడు. డారిల్ మిచెల్ 29 పరుగులతో ఆడుతున్నాడు.
రచిన్ రవీంద్ర అవుట్.. సెకండ్ వికెట్ డౌన్
88 పరుగుల వద్ద న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. రచిన్ రవీంద్ర 42 పరుగులు చేసి మహేశ్ తీక్షణబౌలింగ్ లో అవుటయ్యాడు. 16 ఓవర్లలో 108/2 స్కోరుతో కివీస్ ఆట కొనసాగిస్తోంది.
కాన్వే అవుట్.. ఫస్ట్ వికెట్ డౌన్
86 పరుగుల వద్ద న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. డెవాన్ కాన్వే 45 పరుగులు చేసి దుష్మంత చమీర బౌలింగ్ లో అవుటయ్యాడు. రచిన్ రవీంద్ర 41 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.
ఓపెనర్ల శుభారంభం
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ విజయం దిశగా దూసుకెళుతోంది. ఓపెనర్లు ఆచితూచి ఆడుతుండటంతో వికెట్ నష్టపోకుండా మొదటి 10 ఓవర్లలో 73 పరుగులు చేసింది.
శ్రీలంక ఆలౌట్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?
న్యూజిలాండ్ కు శ్రీలంక 172 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. చివరల్లో మహేశ్ తీక్షణ
పోరాడాడు. 91 బంతుల్లో 3 ఫోర్లతో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దిల్షన్ మధుశంక 48 బంతుల్లో 19 పరుగులు చేసి చివరి వికెట్ గా అవుటయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు పడగొట్టాడు. లాకీ ఫెర్గూసన్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ రెండేసి వికెట్లు తీశారు. టిమ్ సౌతీ ఒక వికెట్ సాధించాడు.
9వ వికెట్ కోల్పోయిన శ్రీలంక
32.1 ఓవర్ లో 128 పరుగుల వద్ద శ్రీలంక 9వ వికెట్ కోల్పోయింది. దుష్మంత చమీర (1) అవుటయ్యాడు. మహేశ్ తీక్షణ మొండిగా పోరాడుతున్నాడు. దిల్షన్ మధుశంకతో కలిసి స్కోరును 150 పరుగులు దాటించాడు.
8వ వికెట్ కోల్పోయిన శ్రీలంక
113 పరుగుల వద్ద శ్రీలంక 8వ వికెట్ కోల్పోయింది. చమిక కరుణరత్నే 6 పరుగులు చేసి లాకీ ఫెర్గూసన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. 30 ఓవర్లలో 125/8 స్కోరుతో శ్రీలంక ఆట కొనసాగిస్తోంది.
కష్టాల్లో శ్రీలంక
70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి శ్రీలంక కష్టాల్లో పడింది. పాతుమ్ నిస్సాంక(2), కుశాల్ మెండిస్(6), సమరవిక్రమ(1), అసలంక(8) స్వల్ప స్కోరుకే అవుటయ్యారు. కుశాల్ ఫెరీరా ఒక్కడే హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి అవుటయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ ఒక్కడే 3 వికెట్లు పడగొట్టాడు. 16 ఓవర్లలో 102/5 స్కోరుతో శ్రీలంక ఆట కొనసాగిస్తోంది.
An electric knock comes to an end, Sri Lanka have lost half their side for 70 ?
LIVE: https://t.co/xEJ99Eyjiy | #NZvSL | #CWC23 pic.twitter.com/b3gospsUH6
— ESPNcricinfo (@ESPNcricinfo) November 9, 2023
3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక
టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
టాస్ గెలిచిన న్యూజిలాండ్
టాస్ గెలిచి న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కివీస్ టీమ్ లో ఇష్ సోధి స్థానంలో లాకీ జట్టులోకి వచ్చాడు. శ్రీలంక జట్టులో ఒక మార్పు జరిగింది. రజిత స్థానంలో చమిక బరిలోకి దిగుతున్నాడు.
NZ vs SL, ICC Cricket World Cup 2023: New Zealand won the toss and elected to bowl first. #ICCCricketWorldCup23 #NZvsSL https://t.co/6ZgGwilUL1
— News18 CricketNext (@cricketnext) November 9, 2023
తుది జట్లు
శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(కెప్టెన్/వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక
న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్
కివీస్ సెమీస్ చేరుతుందా?
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 41వ మ్యాచ్ లో న్యూజిలాండ్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే న్యూజిలాండ్ కు సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి. శ్రీలంక ఇప్పటికే సెమీస్ రేసు నుంచి వైదొలగింది. ప్రపంచకప్ లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 11 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. కివీస్ 5, లంక 6 మ్యాచ్ లు గెలిచాయి.