PAK vs BAN : బంగ్లాదేశ్ పై పాకిస్థాన్ భారీ విజ‌యం

ఈడెన్ గార్డెన్స్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ చావోరేవో తేల్చుకోనుంది.

PAK vs BAN : బంగ్లాదేశ్ పై పాకిస్థాన్ భారీ విజ‌యం

Pakistan vs Bangladesh

Updated On : October 31, 2023 / 8:45 PM IST

 పాకిస్థాన్ విజ‌యం

205 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాకిస్థాన్ 32.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి విజ‌యం సాధించింది. పాకిస్థాన్ బ్యాట‌ర్ల‌లో ఫ‌ఖ‌ర్ జ‌మాన్ (81), అబ్దుల్లా షఫీక్ (68) అర్థ‌శ‌త‌కాల‌తో రాణించారు.

తొలి వికెట్ కోల్పోయిన పాకిస్థాన్
128 పరుగుల వద్ద పాకిస్థాన్ తొలి వికెట్ నష్టపోయింది. మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్ లో అబ్దుల్లా షఫీక్ అవుటయ్యాడు. షఫీక్ 69 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు
చేశాడు. 23 ఓవర్లలో 142/1 స్కోరుతో పాకిస్థాన్ ఆట కొనసాగిస్తోంది.

షఫీక్, జమాన్ హాఫ్ సెంచరీలు
పాకిస్థాన్ నిలకడగా ఆడుతోంది. వికెట్ నష్టపోకుండా 120 పరుగుల స్కోరు దాటేసింది. ఓపెనర్లు హాఫ్ సెంచరీలు చేశారు. అబ్దుల్లా షఫీక్ 56 బంతుల్లో 9 ఫోర్లతో హాఫ్ సెంచరీ
కొట్టాడు. ఫఖర్ జమాన్ 51 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు. 21 ఓవర్లలో 128/0 స్కోరుతో పాకిస్థాన్ ఆట కొనసాగిస్తోంది.

10 ఓవర్లలో పాకిస్థాన్ 52/0
205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ కు ఓపెనర్లు శుభారంభం అందించారు. వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. దీంతో పాకిస్థాన్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ 20, ఫఖర్ జమాన్ 30 పరుగులతో ఆడుతున్నారు.

బంగ్లాదేశ్ ఆలౌట్.. పాకిస్థాన్ టార్గెట్ ఎంతంటే?
పాకిస్థాన్ కు బంగ్లాదేశ్ 205 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా టీమ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. మహ్మదుల్లా(56; 70 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. లిట్టన్ దాస్ (45) షకీబ్ అల్ హసన్ (43), మెహిదీ హసన్ మిరాజ్(25) రాణించారు. మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడంతో బంగ్లా భారీ స్కోరు చేయలేకపోయింది. పాకిస్థాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాసిం జూనియర్ మూడేసి వికెట్లు పడగొట్టారు. హరీస్ రవూఫ్ 2 వికెట్లు తీశాడు. ఇఫ్తికార్ అహ్మద్, ఉసామా మీర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

 

200 పరుగులు దాటిన బంగ్లాదేశ్ స్కోరు
బంగ్లాదేశ్ స్కోరు 200 పరుగులు దాటింది. 23 ఓవర్లలో 200/7 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

షకీబ్ అవుట్.. ఏడో వికెట్ డౌన్
బంగ్లాదేశ్ 185 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 43 పరుగులు చేసి అవుటయ్యాడు.

ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. 140 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. తౌహిద్ హృదయ్ 7 పరుగులు చేసి అవుటయ్యాడు.

ఐదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
130 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. మహ్మదుల్లా 56 పరుగులు చేసి షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో అవుటయ్యాడు.

మహ్మదుల్లా హాఫ్ సెంచరీ.. 100 పరుగులు దాటిన స్కోరు
23 పరుగుకే 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ను మహ్మదుల్లా హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. లిట్టన్ దాస్ తో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించాడు. 58 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో మహ్మదుల్లా అర్ధశతకం పూర్తి చేశాడు.

 

నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
102 పరుగుల వద్ద బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. లిట్టన్ దాస్ 45 పరుగులు చేసి అవుటయ్యాడు. 25 ఓవర్లలో 109/4 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
23 పరుగుల వద్ద బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. ముష్ఫికర్ రహీమ్(5) స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. 11 ఓవర్లలో 48/3 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

ప్రారంభంలోనే బంగ్లాదేశ్ కు షాక్
ప్రారంభంలోనే బంగ్లాదేశ్ కు షాక్ తగిలింది. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. నజ్ముల్ హొస్సేన్ శాంటో 4 పరుగులు చేసి అవుటయ్యాడు. అంతకుముందు తాంజిద్ హసన్ డకౌటయ్యాడు. ఈ రెండు వికెట్లు షాహీన్ అఫ్రిది తీశాడు. 5 ఓవర్లలో 10/2 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

ఫస్ట్ ఓవర్ లోనే బంగ్లాదేశ్ కు షాక్
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ కు ఫస్ట్ ఓవర్ లోనే షాక్ తగిలింది. షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో తాంజిద్ హసన్ అవుటయ్యాడు. దీంతో వన్డేల్లో షాహీన్ అఫ్రిది వందో వికెట్ సాధించాడు.

 

షాహీన్ అఫ్రిది ఘనత
వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని షాహీన్ అఫ్రిది అందుకున్నాడు. వన్డేల్లో వేగంగా 100 వికెట్లు పగడొట్టిన పాకిస్థాన్ బౌలర్ గా ఘనత సాధించాడు. వరల్డ్ ఓవరాల్ లిస్ట్ లో మూడో స్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్ లో నేపాల్ బౌలర్ సందీప్ లమిచానే టాప్ లో ఉన్నాడు. అతడు 42 మ్యాచుల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. రెండో స్థానంలో ఉన్న అఫ్గానిస్థాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ 44 మ్యాచుల్లో 100 వికెట్లు సాధించాడు.

టాస్ గెలిచిన బంగ్లాదేశ్ 
బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాడు. తమ టీమ్ లో ఒక మార్పు జరిగినట్టు చెప్పాడు. పిచ్ ఫస్ట్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉందని, తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం తెలిపాడు. గత మ్యాచ్ లో మూడు విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేశామన్నాడు. తాను కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సివుందని, సెంచరీ చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. తమ జట్టులో మూడు మార్పులు జరిగాయని.. ఇమామ్, షాదాబ్, నవాజ్ స్థానంలో ఫఖర్, సల్మాన్, ఉసామా బరిలోకి దిగుతున్నారని వెల్లడించాడు.

తుది జట్లు

బంగ్లాదేశ్: లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), మహ్మదుల్లా, తౌహిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాం

పాకిస్థాన్: అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, అఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, ఉసామా మీర్, మహ్మద్ వాసిం జూనియర్, హరీస్ రవూఫ్

ODI World Cup 2023 PAK vs BAN : వన్డే ప్రపంచకప్ 31వ మ్యాచ్ లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. పాకిస్థాన్ జట్టుకు ఈ మ్యాచ్ కీలకం. సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మంచి రన్ రేటుతో ఈరోజు మ్యాచ్ లో పాకిస్థాన్ గెలవాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ సెమీస్ అవకాశం లేదు. ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడిన బంగ్లాటీమ్ కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.

అబ్దుల్ రజాక్ అద్భుత ఇన్నింగ్స్
2010లో సరిగ్గా ఇదే రోజున పాకిస్థాన్ అబ్దుల్ రజాక్ అజేయ సెంచరీతో దక్షిణాఫ్రికాపై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 72 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 109 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

 


టాస్ కీలకం
ఈ రోజు మ్యాచ్ లో టాస్ కీలకం కానుంది. ఫస్ట్ బ్యాటింగ్ ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన చివరి ఎనిమిది ODIలలో ఏడింటిలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ ఆడిన 6 వన్డేల్లో 5 గెలిచింది. ఇక్కడ ఆడిన రెండు వన్డేల్లోనూ బంగ్లాదేశ్ ఓడిపోయింది.