SA vs AFG: అఫ్గానిస్థాన్ పై ద‌క్షిణాఫ్రికా విజ‌యం

అహ్మ‌దాబాద్ వేదిక‌గా అఫ్గానిస్థాన్ తో జ‌రిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

SA vs AFG: అఫ్గానిస్థాన్ పై ద‌క్షిణాఫ్రికా విజ‌యం

icc cricket world cup 2023 today south africa vs afghanistan live match score and updates

Updated On : November 10, 2023 / 9:53 PM IST

ద‌క్షిణాఫ్రికా విజ‌యం
245 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 47.3 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ల‌లో వాన్ డెర్ డస్సెన్ (76 నాటౌట్‌) హాఫ్ సెంచ‌రీ చేశాడు. క్వింట‌న్ డికాక్ (41) రాణించాడు.

వాన్ డెర్ డస్సెన్ హాఫ్ సెంచ‌రీ.. 
రహమత్ షా బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 66 బంతుల్లో వాన్ డెర్ డస్సెన్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 35 ఓవ‌ర్ల‌కు ద‌క్షిణాఫ్రికా స్కోరు 175/4. వాన్ డెర్ డస్సెన్ (52), డేవిడ్ మిల్ల‌ర్ (19) లు ఆడుతున్నారు.

క్లాసెన్ క్లీన్‌బౌల్డ్..
ద‌క్షిణాఫ్రికా మ‌రో వికెట్ కోల్పోయింది. ర‌షీద్ కాన్ బౌలింగ్‌లో క్లాసెన్ (10) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 27.3వ ఓవ‌ర్‌లో 139 ప‌రుగుల వ‌ద్ద సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. అంత‌క ముందు మార్‌క్ర‌మ్(25) కూడా ర‌షీద్‌ఖాన్ బౌలింగ్‌లోనే న‌వీన్ ఉల్ హ‌క్ క్యాచ్ అందుకోవ‌డంతో (25)తో మూడో వికెట్ రూపంలో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు

డికాక్ అవుట్.. రెండో వికెట్ డౌన్
దక్షిణాఫ్రికా 70 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డికాక్ 41 పరుగులు చేసి నబీ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. 17 ఓవర్లలో 83/2 స్కోరుతో సౌతాఫ్రికా ఆట కొనసాగిస్తోంది.

తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 64 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. బావుమా 23 పరుగులు చేసి ముజీబ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. డికాక్ 41 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.

సౌతాఫ్రికా టార్గెట్ 245
సౌతాఫ్రికాకు అఫ్గానిస్థాన్ 245 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒంటరి పోరాటంతో అఫ్గాన్ మంచి స్కోరు చేసింది. అజ్మతుల్లా 107 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రహ్మత్ షా 26, నూర్ అహ్మద్ 26, రహ్మానుల్లా గుర్బాజ్ 25, ఇబ్రహీం జద్రాన్ 15, రషీద్ ఖాన్ 14, ఇక్రమ్ అలీఖిల్ 12 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ 4 వికెట్లు పడగొట్టాడు. ఎంగిడి, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు తీశారు. ఆండిల్ ఫెహ్లుక్వాయో ఒక వికెట్ దక్కించుకున్నాడు.

6వ వికెట్ కోల్పోయిన అఫ్గానిస్థాన్
160 పరుగుల వద్ద అఫ్గానిస్థాన్ 7వ వికెట్ కోల్పోయింది.

6వ కోల్పోయిన అఫ్గానిస్థాన్
116 పరుగుల వద్ద అఫ్గానిస్థాన్ 6వ వికెట్ కోల్పోయింది.

3 వికెట్లు కోల్పోయిన అఫ్గానిస్థాన్
అఫ్గానిస్థాన్ 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రహ్మానుల్లా గుర్బాజ్ 25, ఇబ్రహీం జద్రాన్ 15, హష్మతుల్లా షాహిదీ 2 పరుగులు చేసి అవుటయ్యారు.

SA vs AFG: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 42వ మ్యాచ్ లో సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంతో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా జట్టులో తబ్రైజ్ షమ్సీ, మార్కో జాన్సెన్‌లకు విశ్రాంతి ఇచ్చారు. వారిద్దరి స్థానంలో ఆండిలే ఫెహ్లుక్వాయో, గెరాల్డ్ కోయెట్జీ జట్టులోకి వచ్చారు.

 

తుది జట్లు
అఫ్గానిస్థాన్ : రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీఖిల్(వికెట్ కీపర్), ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్

దక్షిణాఫ్రికా : క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, డేవిడ్ మిల్లర్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి