India vs Namibia: నమీబియాపై భారత్ ఘనవిజయం
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.
Pic @ EspnCricInfo
India vs Namibia: టీ20 ప్రపంచ కప్ లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 210 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నమీబియా.. 116 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అర్ష్ దీప్ సింగ్, దూబే, బుమ్రా తలో వికెట్ తీశారు. ఈ టోర్నీలో భారత్ కు ఇది వరుసగా రెండో విజయం. తొలి మ్యాచ్ లో యూఎస్ ఏపై భారత్ గెలుపొందింది.
భారత జట్టులో ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61 పరుగులు), హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. దూబే 23, శాంసన్ 22, తిలక్ 25, సూర్య 12 పరుగులు చేశారు. జోరు మీదున్న భారత్ కు 19వ ఓవర్లో ఝలక్ ఇచ్చింది నమీబియా. ఆ ఓవర్ లో 3 వికెట్లు తీసింది.
