ICC Test Rankings : టాప్‌-10 బ్యాట‌ర్లు, బౌల‌ర్లు వీరే.. విరాట్ కోహ్లి ర్యాంక్ ఎంతంటే..?

అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌() తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను విడుద‌ల చేసింది. గ‌త కొన్నాళ్లుగా బ్యాటింగ్ విభాగంలో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న ఆస్ట్రేలియా బ్యాట‌ర్ ల‌బుషేన్‌కు షాక్ త‌గిలింది.

ICC Test Rankings : టాప్‌-10 బ్యాట‌ర్లు, బౌల‌ర్లు వీరే.. విరాట్ కోహ్లి ర్యాంక్ ఎంతంటే..?

Root-Ashwin-Kohli

Test Rankings : అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ICC) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌(Test Rankings)ను విడుద‌ల చేసింది. గ‌త కొన్నాళ్లుగా బ్యాటింగ్ విభాగంలో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న ఆస్ట్రేలియా బ్యాట‌ర్ ల‌బుషేన్‌( Labuschagne) కు షాక్ త‌గిలింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన తొలి టెస్టులో (0, 13) ఘోరంగా విఫ‌లం కావ‌డంతో అత‌డు 877 పాయింట్ల‌తో మూడో స్థానానికి ప‌డిపోయాడు. అదే స‌మ‌యంలో తొలి ఇన్నింగ్స్‌లో సెంచ‌రీ(118 నాటౌట్‌) చేయ‌డంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లోనూ 46 ప‌రుగుల‌తో రాణించిన ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాడు జో రూట్(Joe Root) 887 పాయింట్ల‌తో మొద‌టి ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు.

Ashes 2023 : గెలిచినా, ఓడినా ఐసీసీ షాక్‌లు త‌ప్ప‌డం లేదుగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జ‌ట్ల‌కు భారీ జ‌రిమానా

ఐపీఎల్‌లో గాయ‌ప‌డి ప్ర‌స్తుతం కోలుకుంటున్న న్యూజిలాండ్ ఆట‌గాడు కేన్ విలియమ్ స‌న్ 883 పాయింట్ల‌తో రెండో స్థానాన్ని ద‌క్కించుకున్నాడు. ఆసీస్ ఆట‌గాడు ట్రావిస్ హెడ్ 873 పాయింట్ల‌తో ఓ స్థానం దిగ‌జారి నాలుగో స్థానానికి ప‌డిపోయాడు. భార‌త్ నుంచి రిష‌బ్ పంత్ 758 పాయింట్ల‌తో ప‌దో స్థానంలో కొన‌సాగుతున్నాడు. భార‌త స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లి ఓ స్థానాన్ని కోల్పోయి 14వ ర్యాంకుకు ప‌డిపోగా, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 12లో కొన‌సాగుతున్నాడు.

Ashes Series: ‘బజ్‌బాల్’ క్రికెట్ వల్లే ఇంగ్లాండ్ ఓడిందంటూ విమర్శలు.. కెప్టెన్ బెన్‌ స్టోక్స్ ఏమన్నాడంటే..

ఇక బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో పెద్ద‌గా మార్పులు చోటు చేసుకోలేదు. 860 పాయింట్ల‌తో టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ మొద‌టి స్థానంలో కొన‌సాగుతుండ‌గా 829 పాయింట్ల‌తో ఇంగ్లాండ్ బౌల‌ర్ జేమ్స్ అండ‌ర‌న్స్ రెండో స్థానంలో ఉన్నాడు. క‌గిసో ర‌బాడ‌(825), పాట్ క‌మిన్స్‌(824) ఆ త‌రువాతి స్థానానాల్లో ఉన్నారు.

ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌

Womens Asia Cup 2023 : ఫైన‌ల్‌లో బంగ్లాదేశ్ చిత్తు.. ఉమెన్స్ ఆసియా క‌ప్ విజేత‌గా భార‌త్‌

టాప్‌-10 బ్యాట‌ర్లు వీరే..

1. జో రూట్ (ఇంగ్లాండ్‌) 887 పాయింట్లు
2. కేన్‌ విలియమ్సన్ (న్యూజిలాండ్‌) 883 పాయింట్లు
3. మార్నస్‌ లబుషేన్ (ఆస్ట్రేలియా) 877 పాయింట్లు
4. ట్రవిస్‌ హెడ్‌(ఆస్ట్రేలియా) 873 పాయింట్లు
5. బాబర్‌ ఆజం (పాకిస్తాన్‌) 862 పాయింట్లు
6. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) 861 పాయింట్లు
7.ఉస్మాన్ ఖ‌వాజా (ఆస్ట్రేలియా) 836 పాయింట్లు
8. డారెల్ మిచెల్ (న్యూజిలాండ్) 792 పాయింట్లు
9.క‌రుణ‌ర‌త్నె (శ్రీలంక‌) 780 పాయింట్లు
10. రిష‌బ్ పంత్ (భార‌త్‌) 758 పాయింట్లు

Ashes 2023 : స్టీవ్ స్మిత్‌ను అవ‌మానించిన ఇంగ్లాండ్ అభిమానులు.. ‘నువ్వు ఏడుస్తుంటే మేము టీవీల్లో చూశాం’..

టాప్‌-10 బౌల‌ర్లు వీరే..

1. ర‌విచంద్ర‌న్ అశ్విన్ (భార‌త్) 860 పాయింట్లు
2. జేమ్స్ అండ‌ర్స‌న్ (ఇంగ్లాండ్‌) 829 పాయింట్లు
3. క‌గిసో ర‌బాడ (సౌతాఫ్రికా) 825 పాయింట్లు
4. పాట్ క‌మిన్స్ (ఆస్ట్రేలియా) 824 పాయింట్లు
5. ఓలి రాబిన్స‌న్ (ఇంగ్లాండ్‌) 802 పాయింట్లు
6. నాథ‌న్ లియోన్ (ఆస్ట్రేలియా) 799 పాయింట్లు
7. షాహీన్ అఫ్రీది (పాకిస్థాన్‌) 787 పాయింట్లు
8. జ‌స్‌ప్రీత్ బుమ్రా (భార‌త్‌) 772 పాయింట్లు
9. ర‌వీంద్ర జ‌డేజా (భార‌త్‌) 765 పాయింట్లు
10. సువ‌ర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్‌) 765 పాయింట్లు