India Team Women’s : భారత్ సెమీస్ అవకాశాలపై వర్షం ఎఫెక్ట్.. వెస్టిండీస్ – దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు
పాక్ జట్టుపై విజయం సాధించిన ఇంగ్లాండ్ నాలుగో స్థానంలో ఉంది. దీంతో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ భారత్ కు కీలకంగా మారింది. సెమీఫైనల్స్ కు అర్హత సాధించాలంటే...

Icc
ICC Women’s World Cup : మహిళల వన్డే ప్రపంచకప్ ను కైవసం చేసుకోవాలని అనుకున్న భారత మహిళల టీంకు ఎదురుదెబ్బ తగిలింది. భారత్ సెమీస్ అవకాశాలు కష్టంగా మారాయి. దీనికి కారణం… వెస్టిండీస్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. 9 పాయింట్లతో దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్ లో అడుగు పెట్టింది. విండీస్ 7 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుని సెమీస్ అవకాశాలను మ. భారత్ ఆరు పాయింట్లు సాధించి… ఐదో స్థానంలో కొనసాగుతోంది.
Read More : ICC Women’s World Cup : మహిళల వన్డే ప్రపంచ కప్.. కష్టాల్లో భారత్ 128/8
పాక్ జట్టుపై విజయం సాధించిన ఇంగ్లాండ్ నాలుగో స్థానంలో ఉంది. దీంతో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ భారత్ కు కీలకంగా మారింది. సెమీఫైనల్స్ కు అర్హత సాధించాలంటే దక్షిణాఫ్రికాను భారత్ ఓడించాల్సి ఉంటుంది. 2022, మార్చి 27వ తేదీ ఆదివారం ఈ మ్యాచ్ జరుగనుంది. విజయం సాధిస్తే… 8 పాయింట్లతో భారత్ థర్డ్ ప్లేస్ కు చేరుకుంటుంది. లేనిపక్షంలో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో టాప్ 04లో నిలిచిన జట్లు మాత్రమే సెమీస్ కు అర్హత సాధిస్తాయి. ఆరు మ్యాచ్ లు ఆడి.. అన్నీ మ్యాచ్ ల్లో విజయం సాధించిన ఆసీస్ మహిళా టీం 12 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉంది.
Read More : ICC U19 World Cup 2022: భవిష్యత్ క్రికెటర్ల మెరుపులు.. నేటి నుంచే ప్రపంచకప్!
దక్షిణాఫ్రికా ఆరు మ్యాచ్ లు ఆడి.. నాలుగు విజయాలు, ఒకటి ఓటమి, మరొకటి రద్దుతో మొత్తం 9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మిగిలిన రెండు బెర్త్ ల కోసం వెస్టిండీస్ (7 పాయింట్లు), ఇంగ్లాండ్ (6 పాయింట్లు), భారత్ (6 పాయింట్లు) పోటీల్లో కొనసాగుతున్నాయి. వెస్టిండీస్ ని దక్షణాఫ్రికా ఓడించే ఉంటే… భారత్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండేవి. కానీ అలా జరగలేదు. వరుణుడి దెబ్బతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. దక్షిణాఫ్రికాపై భారత్ గెలిస్తే.. 8 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకుతుంది. ఏదైనా అద్భుతం జరుగుతుందా ? లేదా ? అనేది చూడాలి.