IML T20 final: ఫైనల్ మ్యాచ్‌లో గొడవపడ్డ యువరాజ్ సింగ్, టినో బెస్ట్.. బ్రియాన్ లారా రావడంతో.. వీడియో వైరల్
యువరాజ్ సింగ్, వెస్టిండీస్ బౌలర్ టినో బెస్ట్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో వెస్టిండీస్ మాస్టర్స్ కెప్టెన్ బ్రియాన్ లారా..

Yuvraj Singh vs Tino Best
Yuvraj Singh vs Tino Best: మాజీ క్రికెటర్లతో నిర్వహించిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML 2025) టీ20 టోర్నీ విజేతగా భారత్ జట్టు నిలిచింది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా మాస్టర్స్ జట్టు వెస్టిండీస్ మాస్టర్స్ జట్టుతో తలపడింది. అయితే, ఇండియా మాస్టర్స్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా టోర్నీ విజేతగా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్ లో యువరాజ్ సింగ్, వెస్టిండీస్ ప్లేయర్ టినో బెస్ట్ మధ్య ఘర్షణ జరిగింది.
యువరాజ్ సింగ్, టినో బెస్ట్ మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో వెస్టిండీస్ మాస్టర్స్ కెప్టెన్ బ్రియాన్ లారా అక్కడకు చేరుకొని వారిని సముదాయించాడు. దీంతో గొడవ సర్దుమణిగింది. అంబటి రాయుడు కూడా టినో బెస్ట్ ను ప్రశాంతంగా ఉండాలంటూ కోరుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: IPL 2025: ఐపీఎల్ ప్రారంభానికి ముందు కేకేఆర్ జట్టుకు బిగ్ షాక్.. టోర్నీ నుంచి కీలక ప్లేయర్ ఔట్
ఇండియా మాస్టర్స్ బ్యాటింగ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్రీజులో అంబటి రాయుడు, యువరాజ్ సింగ్ ఉన్నారు. టినో బెస్ట్ తన ఓవర్ పూర్తిచేసి గాయం కారణంగా మైదానం నుండి వెళ్లిపోవాలనుకున్న తరువాత ఇదంతా ప్రారంభమైంది. అయితే, యువరాజ్ సింగ్ వెస్టిండీస్ బౌలర్ టినో మైదానం వీడుతుండటంపై అంపైర్ తో ప్రస్తావించాడు. అంపైర్ బిల్లీ బౌడెన్ బహుశా టినో బెస్ట్ ను తిరిగిరమ్మని కోరాడు. దీంతో చిరాకుపడిన టినో యువరాజ్ సింగ్ వైపుకు దూసుకొచ్చాడు. యువరాజ్ సైతం వెనక్కుతగ్గలేదు. దీంతో వారిద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఒకరిపై ఒకరు వేలు చూపించుకుంటూ దూకుడుగా ప్రవర్తించారు. ఈ సమయంలో బ్రియాన్ లారా జోక్యం చేసుకొని వారిని అక్కడి నుంచి పంపించివేశారు.
Lafda with Yuvraj vs Tino best ☠️ #IMLT20Final #YuvrajSingh #IMLT20
— CricFreak69 (@Twi_Swastideep) March 16, 2025
ఈ ఘటన తరువాత యువరాజ్ సింగ్ బంతిని సిక్స్ కొట్టాడు. దీంతో తన బ్యాట్ ను టినో బెస్ట్ వైపు చూపినట్లు కనిపించాడు. అయితే, మ్యాచ్ అనంతరం యువరాజ్ సింగ్, టినో బెస్ట్ సరదాగా మాట్లాడుకోవటం గమనార్హం. యువరాజ్ టినో బెస్ట్ వీపును సరదాగా తట్టడం కనిపించింది.
Captain Sachin Tendulkar with IMLT20 Trophy – the happiness in the face 🤍 pic.twitter.com/yUYLphxAtJ
— Johns. (@CricCrazyJohns) March 17, 2025