IND vs AUS : మూడో వన్డే.. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరు ఔట్..

IND vs AUS 3rd ODI ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మూడో వన్డే మ్యాచ్ సిడ్నీలో ప్రారంభమైంది.

IND vs AUS : మూడో వన్డే.. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరు ఔట్..

IND vs AUS 3rd ODI

Updated On : October 25, 2025 / 9:14 AM IST

IND vs AUS 3rd ODI : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మూడో వన్డే మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు తొలుత బౌలింగ్ చేయనుంది. అయితే, ఇప్పటికే జరిగిన రెండు వన్డే మ్యాచ్‌లలో విజయం సాధించిన ఆస్ట్రేలియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో వన్డేలోనూ విజయం సాధించడం ద్వారా సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ 2-1తో ముగించాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.

అయితే, టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. అర్షదీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డిలకు తుది జట్టులో చోటు దక్కలేదు. వారిద్దరిని పక్కన పెట్టి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలకు తుది జట్టులో అవకాశం కల్పించారు.

అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో నితీష్ కుమార్ రెడ్డి ఎడమ క్వాడ్రిసెప్స్ గాయంతో బాధపడ్డాడు. బీసీసీఐ వైద్య బృందం అతనిని పర్యవేక్షిస్తోందని జట్టు యాజమాన్యం తెలిపింది. దీంతో మూడవ వన్డేకు గాయం కారణంగా నితీశ్ కుమార్ రెడ్డి దూరమయ్యాడు.

టాస్ అనంతరం మిచెల్ మార్ష్ మాట్లాడుతూ.. వికెట్ బాగుందనిపిస్తోంది. అందుకే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నామని చెప్పాడు. ఈ వన్డేలో మేము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాం. జేవియర్ బార్ట్‌లెట్ స్థానంలో నాథన్ ఎల్లిస్ జట్టులోకి వచ్చాడని తెలిపాడు.

భారత్ తుది జట్టు ‌: గిల్, రోహిత్, కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్, రాహుల్, అక్షర్‌ పటేల్, సుందర్‌, హర్షిత్‌ రాణా, కుల్‌దీప్‌ యాదవ్‌, సిరాజ్‌, ప్రసీద్‌ కృష్ణ.

ఆస్ట్రేలియా తుది జట్టు: మార్ష్, ట్రావిస్‌ హెడ్, షార్ట్, అలెక్స్‌ కేరీ, రెన్‌షా, కూపర్‌ కనోలి, ఒవెన్, స్టార్క్, ఎలిస్‌, హేజిల్‌వుడ్, జంపా.