Rohit Sharma : మూడో వ‌న్డేలో ఆసీస్ పై రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 50 శ‌త‌కాలు..

సిడ్నీ వేదిక‌గా ఆసీస్‌తో మూడో వ‌న్డేలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) శ‌త‌కం బాదాడు.

Rohit Sharma : మూడో వ‌న్డేలో ఆసీస్ పై రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 50 శ‌త‌కాలు..

IND vs AUS 3rd ODI Rohit Sharma smashes 50th international hundred in Sydney

Updated On : October 25, 2025 / 3:37 PM IST

సిడ్నీ వేదిక‌గా ఆసీస్‌తో మూడో వ‌న్డేలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) శ‌త‌కం బాదాడు. ఆడ‌మ్ జంపా బౌలింగ్‌లో సింగిల్ తీసి 105 బంతుల్లో మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. వ‌న్డేల్లో హిట్‌మ్యాన్‌కు ఇది 33 శ‌త‌కం కావ‌డం విశేషం.

తాజా శత‌కంతో రోహిత్ శ‌ర్మ ఓ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. ఆసీస్ గ‌డ్డ‌పై వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు సాధించిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. తాజా సెంచ‌రీ ఆసీస్ గ‌డ్డ‌పై రోహిత్‌కు 6వ సెంచ‌రీ. ఆ జాబితాలో విరాట్ కోహ్లీ, కుమార సంగ‌క్క‌ర‌లు ఉన్నారు.

Virat Kohli : తొలి రెండు వ‌న్లేల్లో డ‌కౌట్‌.. మూడో మ్యాచ్‌లో సింగిల్ తీయ‌గానే.. కోహ్లీ రియాక్ష‌న్ చూశారా?

వ‌న్డేల్లో ఆసీస్ గ‌డ్డ పై అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్లు వీరే..

* రోహిత్ శ‌ర్మ – 33 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచ‌రీలు
* విరాట్ కోహ్లీ – 32 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచ‌రీలు
* కుమార సంగ‌క్క‌ర (శ్రీలంక‌) – 49 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచ‌రీలు

50 అంత‌ర్జాతీయ సెంచ‌రీలు..

తాజా సెంచ‌రీ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో హిట్‌మ్యాన్‌కు 50 వ శ‌త‌కం కావ‌డం విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌న్డేల్లో 33, టెస్టుల్లో 12, టీ20ల్లో 5 శ‌త‌కాలు రోహిత్ శ‌ర్మ బాదాడు.

IND vs AUS : భార‌త్‌కు భారీ షాక్‌.. గాయంతో మైదానం వీడిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. అత‌డి స్థానంలో మ‌రొక‌రు బ్యాటింగ్ చేయొచ్చా?