Bumrah Injury Update : టీమ్ఇండియాకు భారీ షాక్.. రెండో రోజు మధ్యలోనే మైదానం వీడిన బుమ్రా.. స్కానింగ్ కోసం ఆస్పత్రికి..
ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచులో టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది.

IND vs AUS 5th Test Bumrah leaves the stadium midway through day two
ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచులో టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది. టీమ్ఇండియా స్టాండింగ్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. రెండో రోజు ఆటలో అతడి తొడ కండరాలు పట్టేసినట్లుగా తెలుస్తోంది. భోజన విరామం తరువాత ఓ ఓవర్ వేసిన బుమ్రా ఆ వెంటనే మైదానాన్ని వీడాడు. సహాయక సిబ్బందితో కలిసి ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతడికి స్కానింగ్ నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బుమ్రా మైదానాన్ని వీడి ఆస్పత్రికి వెలుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. బుమ్రా గైర్హాజరీలో విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్నాడు. ఒకవేళ బుమ్రా ఈ మ్యాచ్‌కు దూరం అయితే మాత్రం భారత్‌కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
Jasprit Bumrah : ఆస్ట్రేలియా గడ్డపై బుమ్రా అరుదైన ఘనత.. 46 ఏళ్ల రికార్డు బ్రేక్..
ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బుమ్రా కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఇప్పటి వరకు 10 ఓవర్లు వేసి 33 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా గడ్డపై బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. సిడ్నీ టెస్టులో ఖవాజా, లబుషేన్‌లను ఔట్ చేయడం ద్వారా ఆస్ట్రేలియా గడ్డ పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ రికార్డును అధిగమించాడు. 1977/78 సీజన్‌లో ఆసీస్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో బేడీ 31 వికెట్లు తీశాడు. తాజాగా బుమ్రా 32 వికెట్లతో ఈ రికార్డును బద్దలు కొట్టాడు.
Rohit Sharma: నేనా.. రిటైర్మెంటా..? సిడ్నీ టెస్టులో ఆడకపోవడంపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ
🚨 BUMRAH LEAVES FOR SCANS. 🚨
– Fingers are crossed…!!! 🤞pic.twitter.com/HAdB2tudiX
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 4, 2025