IND vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ రికార్డు బద్దలు.. ఆ జాబితాలో అగ్రస్థానంలోకి..
రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది.

Jasprit Bumrah
IND vs ENG: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ టెస్టులో భాగంగా రెండోరోజు ఆటలో ఇంగ్లాండ్ జట్టు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీమిండియాను 471 పరుగులకు ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్ జట్టు.. ఆ తరువాత బ్యాటింగ్ లోనూ మెరుగైన ప్రదర్శన చేసింది. అయితే, ఇంగ్లాండ్ బ్యాటర్లను టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా హడలెత్తించాడు.
Also Read: IND vs ENG: అరెరే.. టీమిండియా కొంపముంచిన రవీంద్ర జడేజా.. సింపుల్ క్యాచ్ మిస్.. వీడియో వైరల్
రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. ఈ మూడు వికెట్లను జస్ర్పీత్ బుమ్రానే పడగొట్టాడు. క్రాలీ, డకెట్, రూట్ లను తన అద్భుతమైన బౌలింగ్ తో బుమ్రా ఔట్ చేశాడు. ఈ క్రమంలో బుమ్రా సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
బుమ్రా రెండోరోజు మూడవ సెషన్ లో డకెట్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో SENA దేశాలలో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాలు) అత్యధిక టెస్టు వికెట్లు తీసిన ఆసియా బౌలర్ గా ఉన్న పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వశీం అక్రమ్ రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు. వసీం అక్రమ్ SENA దేశాల్లో తన టెస్టు కెరీర్ లో మొత్తం 32 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.. అందులో అతను 24.11 సగటుతో 146 వికెట్లు పడగొట్టాడు. జస్ర్పీబుమ్రా 20.36 సగటుతో 147 వికెట్లు పడగొట్టాడు.
SENA దేశాలలో అత్యధిక వికెట్లు తీసిన ఆసియా బౌలర్లు..
జస్‌ప్రీత్ బుమ్రా (భారతదేశం) – 147* వికెట్లు
వసీం అక్రమ్ (పాకిస్తాన్) – 146 వికెట్లు
అనిల్ కుంబ్లే (భారతదేశం) – 141 వికెట్లు
ఇషాంత్ శర్మ (భారతదేశం) – 127 వికెట్లు
ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) – 125 వికెట్లు
🚨 JASPRIT BUMRAH – MOST TEST WICKETS AS AN ASIAN IN SENA. 🚨 pic.twitter.com/smjjkkCgDK
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2025
ఇషాంత్ శర్మ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్..
జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఇషాంత్ శర్మ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. బుమ్రా ఇప్పటివరకు మొత్తం 39 వికెట్లు పడగొట్టగా, ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఇషాంత్ శర్మ మొత్తం 51 వికెట్లు సాధించాడు. అయితే, ఇషాంత్ శర్మ కంటే బుమ్రా ఇంకా 13 వికెట్లు వెనకబడి ఉన్నాడు. ఈ టెస్టు సిరీస్ లో ఆ రికార్డును బుమ్రా బద్దలు కొట్టే అవకాశాలున్నాయి.