IND vs ENG 3rd Test Day 2 : ముగిసిన రెండో రోజు ఆట
రాజ్‌కోట్ టెస్టు మ్యాచులో రెండో రోజు ఆట ముగిసింది.

IND vs ENG 3rd Test
ముగిసిన రెండో రోజు ఆట.. ఇంగ్లాండ్ 207/2
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో రెండో రోజు ఆట ముగిసింది. 326/5 తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ 445 పరుగులకు ఆలౌటైంది. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. డకెట్ (133), రూట్ (9) లు క్రీజులో ఉన్నారు.
That’s Stumps on Day 2 in Rajkot!
England move to 207/2, trail by 238 runs.
Scorecard ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/qZgkVvcNg7
— BCCI (@BCCI) February 16, 2024
పోప్ ఎల్బీడబ్ల్యూ..
ఇంగ్లాండ్ మరో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఒల్లీ పోప్(39) ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 182 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
LBW!
Decision overturned and @mdsirajofficial breaks the partnership ?
England lose Ollie Pope.
Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/xpj97nmgzp
— BCCI (@BCCI) February 16, 2024
బెన్‌డకెట్ సెంచరీ..
మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ 88 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారత దేశంలో అతడికి ఇదే తొలి సెంచరీ. 26 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 148 1. బెన్‌డకెట్ (106), ఓలి పోప్ (20)లు ఆడుతున్నారు.
? DUCKY! That is one dominant innings!
Match Centre: https://t.co/W5T5FEBY7t
?? #INDvENG ??????? | @BenDuckett1 pic.twitter.com/YFJRQq2Khv
— England Cricket (@englandcricket) February 16, 2024
జాక్‌క్రాలీ ఔట్
ఎట్టకేలకు ఇంగ్లాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో రజత్ పాటిదార్ క్యాచ్ అందుకోవడంతో ఓపెనర్ జాక్ క్రాలీ(15) ఔట్ అయ్యాడు. దీంతో 13.1వ ఓవర్‌లో 89 పరుగుల వద్ద ఇంగ్లాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. కాగా.. అశ్విన్‌కు ఇది టెస్టుల్లో 500 వికెట్ కావడం విశేషం.
??. ???! ? ?
Only the second #TeamIndia cricketer to reach this landmark in Tests ? ?
Congratulations, @ashwinravi99 ? ?#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/bP8wUs6rd0
— BCCI (@BCCI) February 16, 2024
బెన్ డకెట్ హాఫ్ సెంచరీ..
మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 39 బంతుల్లో ఓపెనర్ బెన్‌డకెట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 67/0. జాక్ క్రాలీ (11), బెన్ డకెట్ (50) లు ఆడుతున్నారు.
టీ విరామం
రెండో టీ విరామ సమయానికి ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. బెన్ డకెట్ (19), జాక్ క్రాలీ (6)లు క్రీజులో ఉన్నారు.
భారత తొలి ఇన్నింగ్స్ 445 ఆలౌట్..
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ (131), రవీంద్ర జడేజా (112) శతకాలతో చెలరేగారు. సర్ఫరాజ్ రాజ్ (62) హాఫ్ సెంచరీ చేశాడు. ధ్రువ్ జురెల్ (46), అశ్విన్ (37) లు రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్‌వుడ్ నాలుగు వికెట్లు తీశాడు. రెహాన్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. టామ్ హార్డ్లీ, జో రూట్, జేమ్స్ అండర్సన్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
Innings Break!
A solid batting performance from #TeamIndia to post 4⃣4⃣5⃣ on the board! ? ?
Scorecard ▶️ https://t.co/FM0hVG5pje#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/jNltRFg5FN
— BCCI (@BCCI) February 16, 2024
లంచ్ విరామం
రెండో రోజు లంచ్ విరామానికి మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 388 పరుగులు చేసింది. అరంగ్రేట ఆటగాడు ధ్రువ్ జురెల్ (31), రవిచంద్రన్ అశ్విన్ (25) లు క్రీజులో ఉన్నారు.
It’s Lunch on Day 2 of the third Test! #TeamIndia added 62 runs to their overnight score to move to 388/7.
Stay Tuned for the Second Session! ⌛️
Scorecard ▶️ https://t.co/FM0hVG5pje #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/ocM5rdcpL4
— BCCI (@BCCI) February 16, 2024
స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు..
ఓవర్ నైట్ స్కోరు 326/5 తో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్ నైట్ బ్యాటర్లు కుల్దీప్ యాదవ్ (4) నిన్నటి స్కోరుకు మరో మూడు పరుగులు మాత్రమే జత చేసి జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. రవీంద్ర జడేజా(112) నిన్నటి స్కోరుకు మరో రెండు పరుగులు మాత్రమే జత చేసి జో రూట్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో భారత్ 331 పరుగుల వద్ద ఏడు వికెట్లు కోల్పోయింది.
That’s some start! ?
2⃣ wickets in the first 4⃣ overs
Match Centre: https://t.co/W5T5FEBY7t
?? #INDvENG ??????? | #EnglandCricket pic.twitter.com/xAkcnobw4v
— England Cricket (@englandcricket) February 16, 2024