IND vs ENG 3rd Test Day 4 : మూడో టెస్టులో ఇంగ్లాండ్ చిత్తు.. భార‌త్ ఘ‌న విజ‌యం

మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను భార‌త్ చిత్తు చిత్తుగా ఓడించింది.

IND vs ENG 3rd Test Day 4 : మూడో టెస్టులో ఇంగ్లాండ్ చిత్తు.. భార‌త్ ఘ‌న విజ‌యం

IND vs ENG 3rd Test

Updated On : February 18, 2024 / 4:57 PM IST

భార‌త్ ఘ‌న విజ‌యం
557 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ 39.4 ఓవ‌ర్ల‌లో 122 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో భార‌త్ 434 ప‌రుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజ‌యంతో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌తో భార‌త్ 2-1 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.

వ‌రుస‌గా వికెట్లు కోల్పోతున్న ఇంగ్లాండ్..
భార‌త స్పిన్న‌ర్ల ధాటికి ఇంగ్లాండ్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోతుంది. జోరూట్ (7)ను జ‌డేజా ఔట్ చేయ‌గా బెన్‌స్టోక్స్ (15), రెహాన్ అహ్మ‌ద్ (0)ల‌ను కుల్దీప్ యాద‌వ్ పెవిలియ‌న్‌కు చేర్చాడు. దీంతో 24.4వ ఓవ‌ర్‌లో 50 ప‌రుగుల‌కే ఏడు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది.

వ‌రుస ఓవ‌ర్ల‌లో జ‌డేజా రెండు వికెట్లు..
ర‌వీంద్ర జ‌డేజా త‌న వ‌రుస ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు తీశాడు. మొద‌ట‌గా ఒలీపోప్ (3)ను ఔట్ చేయ‌గా ఆత‌రువాత జానీ బెయిర్ స్టో(4)ను ఎల్బీగా పెవిలియ‌న్‌కు చేర్చాడు. దీంతో ఇంగ్లాండ్‌ 11.1వ ఓవ‌ర్‌లో 28 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

టీ బ్రేక్‌..
భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు వ‌రుస షాక్‌లు త‌గిలాయి. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ఓపెన‌ర్లు పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. బెన్‌డ‌కెట్ (4) ర‌నౌట్ కాగా.. జాక్ క్రాలీ(11) బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీగా ఔట్ అయ్యాడు. ప్ర‌స్తుతం టీ విరామానికి ఇంగ్లాండ్ 8.2 ఓవ‌ర్లో రెండు వికెట్లు కోల్పోయి 18 ప‌రుగులు చేసింది.

ఇంగ్లాండ్ విజ‌య ల‌క్ష్యం 557
య‌శ‌స్వి జైస్వాల్ డ‌బుల్ సెంచ‌రీ చేసిన కాసేప‌టికే భార‌త్ త‌న రెండో ఇన్నింగ్స్‌ను 430/4 వ‌ద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 557 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యం నిలిచింది. భార‌త బ్యాట‌ర్లు జైస్వాల్ (214*), గిల్ (91), స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (68*) లు రాణించారు. ఇంగ్లాండ్ బౌల‌ర్లో జో రూట్‌, టామ్ హార్డ్లీ, రెహాన్ అహ్మ‌ద్ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

య‌శ‌స్వి జైస్వాల్ ద్విశ‌త‌కం..
జో రూట్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 231 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స‌ర్లు సాయంతో య‌శ‌స్వి జైస్వాల్ డ‌బుల్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. య‌శ‌స్వి టెస్టు కెరీర్‌లో అత‌డికి ఇది రెండో ద్విశ‌త‌కం కావ‌డం విశేషం.

జైస్వాల్ 150 ప‌రుగులు
అండ‌ర్స‌న్ బౌలింగ్‌లో సింగిల్ తీసిన య‌శ‌స్వి జైస్వాల్ 192 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స‌ర్ల‌తో 150 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. 83 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 321/4. య‌శ‌స్వి జైస్వాల్ (154), స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (23) లు క్రీజులో ఉన్నారు.

లంచ్ బ్రేక్.. 
నాలుగో రోజు ఆట‌లో లంచ్ విరామానికి భార‌త్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు న‌ష్ట‌పోయి 314 ప‌రుగులు చేసింది. య‌శ‌స్వి జైస్వాల్ (149), స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (22) లు క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం భార‌త్ 440 ఆధిక్యంలో ఉంది.


కుల్దీప్ యాద‌వ్ ఔట్‌.. 
భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మ‌ద్ బౌలింగ్ జో రూట్ క్యాచ్ అందుకోవ‌డంతో కుల్దీప్ యాద‌వ్ (27) ఔట్ అయ్యాడు. దీంతో 71.4వ ఓవ‌ర్‌లో 258 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ నాలుగో వికెట్ కోల్పోయింది.

గిల్ సెంచ‌రీ మిస్‌..
ఎట్ట‌కేల‌కు ఇంగ్లాండ్‌కు మ‌రో వికెట్ ద‌క్కింది. సెంచ‌రీకి తొమ్మిది ప‌రుగుల దూరంలో శుభ్‌మ‌న్ గిల్ (91; 151 బంతుల్లో 9 ఫోర్లు, 2సిక్స‌ర్లు) ర‌నౌట్ అయ్యాడు. దీంతో భాత‌ర్ 63.6 ఓవ‌ర్‌లో 246 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది.

ప్రారంభ‌మైన నాలుగో రోజు ఆట‌
రాజ్‌కోట్‌లో భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ప్రారంభ‌మైంది. ఓవ‌ర్ నైట్ స్కోరు 196/2 తో రెండో ఇన్నింగ్స్‌ను భార‌త్ కొన‌సాగిస్తోంది. శుభ్‌మ‌న్ గిల్ (64), కుల్దీప్ యాద‌వ్ (3)లు క్రీజులో ఉన్నారు.