IND vs ENG T20: భారత జట్టుకు బిగ్‌షాక్.. ఇంగ్లాండ్‌తో రెండో టీ20కి అభిషేక్ శర్మ దూరం..? ఓపెనర్‌గా ఎవరంటే..
మొదటి టీ20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 34 బంతుల్లో 79 పరుగుల చేసి టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించాడు.

Abhishek Sharma
IND vs ENG T20: ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో మ్యాచ్ ఇవాళ (25వ తేదీ) సాయంత్రం జరగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లోనూ విజయం సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే, రెండో టీ20 మ్యాచ్ ముందే భారత్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మొదటి మ్యాచ్ లో సుడిగాలి ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ జట్టు ఓటమిలో కీలక భూమిక పోషించిన టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఇవాళ జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉండటం లేదని సమాచారం. ఆయన ప్రాక్టీస్ సెషన్ లో గాయపడ్డాడు.
Also Read: IND vs ENG : రెండో టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? శనివారం చెన్నైలో వాతావరణం ఎలా ఉంటుందంటే?
మొదటి టీ20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 34 బంతుల్లో 79 పరుగుల చేసి టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించాడు. అయితే, అభిషేక్ శర్మ చెన్నై చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో గాయపడ్డాడు. క్యాచింగ్ ప్రాక్టీస్ లో భాగంగా మడమ బెణకడంతో అభిషేక్ ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియోథరఫీ వచ్చి చికిత్స అందించాడు. ఆ సమయంలో అభిషేక్ తీవ్ర నొప్పితో ఇబ్బందిపడ్డాడు. అనంతరం కొద్దిసేపటికే డ్రెస్సింగ్ రూమ్ కు కుంటుకుంటూ వెళ్లాడు. ఆ తరువాత ప్రాక్టీస్ సెషన్ కు అతను తిరిగి రాలేదు. దీంతో శనివారం సాయంత్రం జరిగే మ్యాచ్ లో అతను ఆడే విషయంపై సందిగ్దత నెలకొంది. రెండో టీ20కి అభిషేక్ దూరమవుతున్నట్లు టీమ్ మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా.. ఆయన గాయం కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ అభిషేక్ శర్మ రెండో టీ20 మ్యాచ్ కు దూరమైతే అతని స్థానంలో ఓపెనర్ గా తిలక్ వర్మ క్రీజులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అభిషేక్ ప్లేసులో వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ లో ఒకరు తుది జట్టులో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుండటంతోపాటు.. అక్కడి పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుండటంతో వాషింగ్టన్ సుందర్ వైపు టీమ్ మేనేజ్మెంట్ మొగ్గుచూపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
🚨 ABHISHEK SHARMA DOUBTFUL FOR 2ND T20I MATCH AGAINST ENGLAND 🚨
– Abhishek Sharma suffered an ankle injury during a practice session ahead of the second T20I Match.#AbhishekSharma | #INDvENG pic.twitter.com/pJF9UVoGRi
— Abhishek Sharma Fan 𝕏 (@Abhishek_Fan_) January 24, 2025
ఇవాళ జరిగే రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా పాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. చెన్నైలోని చెపాక్ పిచ్ ఎప్పుడూ స్పిన్నర్లకే అనుకూలం అన్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి.