IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య (IND vs ENG) నేటి నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
IND vs ENG t20 series live streaming and telecast details here
- నేటి నుంచే భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్
- చెస్టర్-లె-స్ట్రీట్‌లోని రివర్సైడ్ గ్రౌండ్లో తొలి టీ20 మ్యాచ్
- వైభవ్ సూర్యవంశీ అరంగ్రేటం చేసేనా?
IND vs ENG : ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఓడిపోవడాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేదు. అప్పుడే టీమ్ఇండియా ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు రెడీ అయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు (జూలై 1) చెస్టర్-లె-స్ట్రీట్‌లోని రివర్సైడ్ గ్రౌండ్లో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. కెప్టెన్‌గా తొలి సిరీస్‌ను చేజార్చుకున్న శ్రేయస్ అయ్యర్‌కు ఇంగ్లాండ్ సిరీస్ అగ్నిపరీక్ష కానుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పైనే ఉంది.
ఐపీఎల్ 2026, భారత్-ఏ తరుపున మెరుపులు మెరిపించి టీమ్ఇండియాలో చోటు దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగ్రేటం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడతాడని భావించగా జట్టు మేనేజ్మెంట్ అతడికి తుది జట్టులో చోటు ఇవ్వలేదు. కనీసం ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లోనైనా అతడు అరంగ్రేటం చేస్తాడా? లేదా? అని దానిపైనే అందరి దృష్టి ఉంది.
ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమైన సంజూ శాంసన్ పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. అతడి స్థానంలో వైభవ్ ఓపెనర్‌గా బరిలోకి దిగొచ్చు.
భారత్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టీ20 మ్యాచ్ – జూలై 1న చెస్టర్-లె-స్ట్రీట్‌లోని రివర్సైడ్ గ్రౌండ్లో (భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు)
* రెండో టీ20 మ్యాచ్ – జూలై 4న మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో (భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు)
* మూడో టీ20 మ్యాచ్ – జూలై 7న ట్రెంట్ బ్రిడ్జ్‌లోని నాటింగ్‌హామ్‌లో (భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు )
* నాలుగో టీ20 మ్యాచ్ – జూలై 9న బ్రిస్టల్‌లోని సీట్ యూనిక్ స్టేడియంలో (భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు)
* ఐదో టీ20 మ్యాచ్ – జూలై 11న సౌతాంప్టన్‌లోని యుటిలిటా బౌల్లో (భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు)
టీ20లకు ఎంపిక చేసిన జట్లు ఇవే..
భారత జట్టు..
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్జ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ
ఇంగ్లాండ్ జట్టు..
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), టామ్ బాంటన్ (వికెట్ కీపర్), జోర్డాన్ కాక్స్ (వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, జేమ్స్ కోల్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సోనీ బేకర్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.
మ్యాచ్‌లను ఎక్కడ చూడొచ్చంటే?
భారత్ ఇంగ్లాండ్ వైట్-బాల్ పర్యటన ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ దక్కించుకుంది. టీ20, వన్డే సిరీస్‌లోని మ్యాచ్‌లు టీవీల్లో అయితే సోనీ స్పోర్ట్స్ ఛానల్లో ప్రత్యక్షప్రసారం కానున్నాయి. ఇక ఓటీటీల విషయానికి వస్తే.. సోనీ లివ్, జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.
