IND vs NZ : ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ హెడ్-టు-హెడ్ రికార్డ్స్..
ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు ఎన్ని సార్లు తలపడ్డాయో తెలుసా?

Pic credit @bcci twitter
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆఖరి అంకానికి చేరుకుంది. మార్చి 9న దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్, న్యూజిలాండ్ జట్లు ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కప్పు కోసం పోటీపడనున్నాయి.
సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్ పైనల్ చేరుకోవడం ఇది మూడోసారి. అటు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ శతకాలు బాదడంతో దక్షిణాఫ్రికాను 50 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ చేరుకుంది న్యూజిలాండ్ టీమ్. కాగా.. కివీస్ జట్టు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
గ్రూప్ స్టేజీలో న్యూజిలాండ్‌ను ఓడించింది భారత జట్టు. అదే విధంగా ఫైనల్‌లోనూ ఓడించి ముచ్చటగా మూడోసారి కప్పును ముద్దాడాలని భారత్ ఆరాటపడుతోంది. మరోవైపు గ్రూప్ స్టేజీలో ఎదురైన ఓటమికి ఫైనల్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని కివీస్ భావిస్తోంది.
ఈ క్రమంలో ఈ రెండు జట్లు ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఎన్ని సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయో ఓ సారి చూద్దాం..
నాలుగు సందర్భాల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు నాకౌట్ మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్, 2019, 2023 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్స్, 2021లో ప్రపంచటెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత్, న్యూజిలాండ్‌లు జట్లు ఢీకొన్నాయి. ఇందులో 2023 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ మినహా మిగిలిన మూడు సందర్భాల్లో భారత్ ఓడిపోయింది. దీంతో నాకౌట్ మ్యాచ్‌ల్లో కివీస్ 3-1ఆధిక్యంలో నిలిచింది.
2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్‌ను ఓడించి తొలిసారి ఐసీసీ టైటిల్‌ను ముద్దాడింది న్యూజిలాండ్. ఇక యాదృఛ్చికంగా 2021లో ప్రపంచటెస్టు ఛాంపియన్ షిప్ పైనల్ మ్యాచ్‌లో భారత్ ను ఓడించి రెండో ఐసీసీ టోర్నీని గెలుచుకుంది.