IND vs PAK: పాక్ మీద ఇండియా తోపే.. కానీ ఆ ఒక్కడి వల్లే కొంచెం టెన్షన్..

ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే.. ఆ మజానే వేరు. బాల్ బాల్ కి నరాలు తెగేంత టెన్షన్ ఉంటుంది. సై అంటే సై అంటూ ఇరు జట్ల ఆటగాళ్లు..

IND vs PAK: పాక్ మీద ఇండియా తోపే.. కానీ ఆ ఒక్కడి వల్లే కొంచెం టెన్షన్..

Updated On : February 23, 2025 / 12:24 AM IST

IND vs PAK: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్ మరికొన్ని గంటల్లో మొదలవనుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే అది హైవోల్టేజ్ మ్యాచ్. అవును.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడబోతున్నాయి. ఇప్పుడు అందరి చూపు ఈ మ్యాచ్ పైనే ఉంది. ఈ పోరులో గెలుపు ఎవరిది అనే నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.

ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే.. ఆ మజానే వేరు. బాల్ బాల్ కి నరాలు తెగేంత టెన్షన్ ఉంటుంది. సై అంటే సై అంటూ ఇరు జట్ల ఆటగాళ్లు గ్రౌండ్ లోకి దిగుతారు. రెండు జట్లకు గెలుపు ఎంతో ప్రతిష్టాత్మకం. ఈ మ్యాచ్ కచ్చితంగా హోరాహరీగా జరగటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

మ్యాటర్ లోకి వస్తే.. ఏ రకంగా చూసుకున్నా.. పాకిస్తాన్ మీద ఇండియా తోపే. అందులో ఎలాంటి డౌట్ లేదు. భారత్ విజయాల ట్రాక్ రికార్డ్ కూడా అదే చెబుతుంది. ఇక, ఇండియా టీమ్ ఫామ్ లోనే ఉంది. ఆదివారం జరగబోయే పిచ్ స్పిన్ పిచ్ అంటున్నారు. ఐదుగురు స్పిన్నర్లతో ఇండియా రెడీగా ఉంది. కానీ, ప్రత్యర్థి పాకిస్తాన్ లో ఒక్కడే స్పిన్నర్ ఉన్నాడు. ఇక, పాక్ సీనియర్లు కూడా ఇండియానే గెలుస్తుందని చెబుతున్నారు.

Also Read : ఇండియా vs పాక్ మ్యాచ్ లో పూనకాలేనా? విరాట్ కోహ్లీ ట్రాక్ రికార్డు చూస్తే.. ఇప్పటికీ అదే హయ్యస్ట్..

యువ సంచలనం శుభ్ మన్ గిల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకి పాక్ మీద మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. పాక్ తో మ్యాచ్ అంటే ఈ ఇద్దరూ పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. బ్యాట్ తో చెలరేగిపోతారు. పరుగుల వరద పారిస్తారు. ఇక, హార్ధిక్ పాండ్యా కూడా ఏమీ తక్కువ కాదు. 2017లో చెలరేగిపోయాడు.

ఓవరాల్ గా చూస్తే.. పాక్ మీద ఇండియా తోపే. అందులో నో డౌట్. కానీ, ఒక్కటే ప్రాబ్లం. అదేమిటంటే పాకిస్తాన్ లో పేస్ బౌలర్ షాహీన్ అఫ్రీదీ. అవును.. ఈ లెఫ్ట్ హ్యాండ్ సీమర్ భారత్ ను కాస్త టెన్షన్ పెడుతున్నాడు. ఎందుకంటే.. ఇండియన్ టీమ్ లో లెఫ్ట్ హ్యాండ్ సీమర్ ని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు.. అఫ్రీదీ బౌలింగ్ అంటే ఇబ్బంది పడతారు. అదే ఇప్పుడు ఇండియా క్రికెట్ లవర్స్ ను కాస్త టెన్షన్ పెడుతోంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ లో ఎవరిది పైచేయి అవుతుందా అనేది ఉత్కంఠగా మారింది.

విరాట్ కోహ్లీ వర్సెస్ షాహీన్ అఫ్రీదీ.. రోహిత్ శర్మ వర్సెస్ షాహీన్ అఫ్రీదీ.. వీరి మధ్య జరిగిన పోరుకు సంబంధించి ఒకసారి గణాంకాలు చూస్తే..

బ్యాటర్ – విరాట్ కోహ్లీ
బౌలర్ – షాహీన్ అఫ్రీదీ

2023 సంవత్సరం
వన్డేలు
31 బంతుల్లో 34 పరుగులు
ఒకసారి ఔట్
డాట్స్ – 13
ఫోర్లు – 4
సిక్సులు – 0
స్ట్రైక్ రేట్ – 109.7
యావరేజ్ – 34.0

టీ20లు..
2021 సంవత్సరం
10 బంతుల్లో 11 పరుగులు
ఒకసారి ఔట్
డాట్స్ – 5
ఫోర్లు – 0
సిక్స్ – 1
స్ట్రైక్ రేట్ – 111.0
యావరేజ్ – 11.0

Also Read : పాకిస్తాన్ మీద రోహిత్ సేన సర్జికల్ స్ట్రేకే.. ఆ పిచ్ మీద వీళ్లు చెలరేగితే..

2022 సంవత్సరం
12 బంతుల్లో 23 పరుగులు
ఔట్ – 0
డాట్స్ – 3
ఫోర్లు – 4
సిక్సులు – 0
స్ట్రైక్ రేట్ – 191.7

2021, 2022 సంవత్సరాలు..
22 బంతుల్లో 34 పరుగులు
ఔట్స్ – 01
డాట్స్ – 08
ఫోర్లు – 04
సిక్సులు – 01
స్ట్రైక్ రేట్ – 154.5
యావరేజ్ – 34.0

రోహిత్ శర్మ వర్సెస్ షాహీన్ అఫ్రీదీ..

బ్యాటర్ – రోహిత్ శర్మ
బౌలర్ – షాహీన్ అఫ్రీదీ

వన్డేలు
2018 సంవత్సరం
19 బంతులు – 18 పరుగులు
ఔట్లు – 0
డాట్స్ – 13
ఫోర్లు – 02
సిక్సులు – 01
స్ట్రైక్ రేట్ – 94.7

2023 సంవత్సరం
37 బంతుల్లో 30 పరుగులు
ఔట్లు – 02
డాట్స్ – 26
ఫోర్లు – 03
సిక్సులు – 02
స్ట్రైక్ రేట్ – 81.1

2018, 2023 సంవత్సరాలు కలిపి…
56 బంతుల్లో 48 పరుగులు
ఔట్లు – 02
డాట్స్ – 39
ఫోర్లు – 05
సిక్సులు – 03
స్ట్రైక్ రేట్ – 85.7
యావరేజ్ – 24.0

టీ20లు..
2021 సంవత్సరం
1 బంతి – 0 పరుగులు
ఔట్లు – 01
డాట్స్ – 01

2022 సంవత్సరం
5 బంతులు – 4 పరుగులు
డాట్స్ – 02
స్ట్రైక్ రేట్ – 80.0

2024 సంవత్సరం
10 బంతులు – 08 పరుగులు
ఔట్స్ – 01
డాట్స్ – 08
ఫోర్లు – 00
సిక్సులు – 01
స్ట్రైక్ రేట్ – 80.0
యావరేజ్ – 8.0

2021, 2022, 2024 సంవత్సరాలు..
16 బంతులు – 12 పరుగులు
ఔట్లు – 02
డాట్స్ – 11
ఫోర్లు – 00
సిక్సులు – 01
స్ట్రైక్ రేట్ – 75.0
యావరేజ్ – 6.0