Tilak Varma : వర్త్ వర్మ వర్త్.. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో తిల‌క్ వండర్ ఫుల్ ఘనత..

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ (Tilak Varma) అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

Tilak Varma : వర్త్ వర్మ వర్త్.. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో తిల‌క్ వండర్ ఫుల్ ఘనత..

IND vs SA 1st T20 Tilak Varma joins becomes 5th fastest Indian to 1000 T20I runs

Updated On : December 10, 2025 / 10:23 AM IST

Tilak Varma : అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టీమ్ఇండియా త‌రుపున పొట్టి ఫార్మాట్‌లో వెయ్యి ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు.

క‌ట‌క్ వేదిక‌గా మంగ‌ళ‌వారం ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 4 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వద్ద తిల‌క్ (Tilak Varma)ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తిల‌క్ వ‌ర్మ 32 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 26 ప‌రుగులు సాధించాడు.

Hardik Pandya : అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో హార్దిక్ పాండ్యా అరుదైన మైలురాయి..

భార‌త్ త‌రుపున టీ20 క్రికెట్‌లో 1000 ప‌రుగులు పూర్తి చేసుకున్న 13వ ఆట‌గాడిగా నిలిచాడు. అంతేకాదండోయ్‌.. భార‌త్ త‌రుపున వెయ్యి ప‌రుగుల‌ను అత్య‌ధిక వేగంగా సాధించిన ఆట‌గాళ్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.

భార‌త్ త‌రుపున టీ20ల్లో అత్య‌ధిక వేగంగా 1000 ప‌రుగులు సాధించిన ఆట‌గాళ్లు వీరే..

* విరాట్ కోహ్లీ – 27 ఇన్నింగ్స్‌ల్లో
* అభిషేక్ శ‌ర్మ – 28 ఇన్నింగ్స్‌ల్లో
* కేఎల్ రాహుల్ – 29 ఇన్నింగ్స్‌ల్లో
* సూర్య‌కుమార్ యాద‌వ్ – 31 ఇన్నింగ్స్‌ల్లో
* తిల‌క్ వ‌ర్మ – 34 ఇన్నింగ్స్‌ల్లో

IND vs SA : తొలి టీ20 మ్యాచ్‌లో ఘోర ఓట‌మి.. ‘మేమేందుకు ఓడిపోయామంటే..’ ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్ర‌మ్ కామెంట్స్..

2023లో టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన తిల‌క్ వ‌ర్మ ఇప్ప‌టి వ‌ర‌కు 37 మ్యాచ్‌లు ఆడాడు. 34 ఇన్నింగ్స్‌లో 46.5 స‌గ‌టుతో 1022 ప‌రుగులు సాధించాడు. ఇందులో రెండు శ‌త‌కాలు, నాలుగు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.