Ind Vs SA : టీమిండియా 174 ఆలౌట్.. దక్షిణాఫ్రికా టార్గెట్ 305 రన్స్
సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. భారత్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో 174 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా ముందు 305 పరుగుల

Ind Vs Sa
Ind Vs SA : సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. భారత్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో 174 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా ముందు 305 పరుగుల టార్గెట్ ఉంచింది. భారత జట్టు సెకండ్ ఇన్నింగ్స్ లో 174 పరుగులకు ఆలౌట్ అవగా, మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం (130)తో కలుపుకుని భారత్ 304 పరుగుల లీడ్ సాధించింది.
రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు కేఎల్ రాహుల్ 23, మయాంక్ అగర్వాల్ 4, శార్దూల్ ఠాకూర్ 10, ఛెతేశ్వర్ పుజారా 16, విరాట్ కోహ్లీ 18, అజింక్య రహానె 20, రిషభ్ పంత్ 34, అశ్విన్ 14, షమీ 1, బుమ్రా 7* పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ 4, జాన్‌సెన్ 4, ఎంగిడి 2 వికెట్లు పడగొట్టారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 327 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 197 రన్స్ చేసింది.
Mark Zuckerberg: వ్యవసాయంలోకి మార్క్ జూకర్‌బర్గ్, రూ.127కోట్లతో స్థలం కొనుగోలు
ఓవర్‌నైట్ 16/1 స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. శార్దూల్‌ను ఔట్ చేసి వికెట్ల పతనం ప్రారంభించిన రబాడ (4/42).. కోహ్లి సేన తక్కువ స్కోరుకే పరిమితం కావడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం రబాడతోపాటు జాన్సెన్, ఎంగిడి విజృంభించడంతో భారత్ ఆటగాళ్లు పరుగులు చేసేందుకు ఇబ్బందిపడ్డారు. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో సఫారీ పేసర్లు కగిసో రబాడా, మార్కో జాన్సెన్ నిప్పులు చెరిగారు. వీరిద్దరూ చెరో 4 వికెట్లు తీశారు. ముఖ్యంగా, కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న లెఫ్టార్మ్ సీమర్ మార్కో జాన్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా లైనప్ ను దెబ్బతీశాడు.
టీమిండియా ఇన్నింగ్స్ లో అత్యధికంగా రిషబ్ పంత్ 34 పరుగులు చేశాడు. వేగంగా ఆడిన పంత్ 34 బంతులు ఎదుర్కొని 6 బౌండరీలు బాదాడు. రహానే సైతం ధాటిగానే ఆడాడు. రహానే 23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 20 పరుగులు రాబట్టాడు.
Scientists Warning: అంతరిక్షంలోకి మనుషులు వెళితే చంపుకుతినడం ఖాయం: శాస్త్రవేత్తలు
కాగా, పిచ్ నుంచి పేసర్లకు బాగా సహకారం అందుతోంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా జట్టుకి లక్ష్యఛేదన అంత సులువుగా కనిపించడం లేదు. సఫారీ పేసర్లకు వికెట్లు లభించిన తీరు టీమిండియా పేసర్లలోనూ ఉత్సాహం నింపింది. పిచ్ పై బౌన్స్ ను ఉపయోగించుకుని దక్షిణాఫ్రికన్ల పనిపట్టాలని భారత ఫాస్ట్ బౌలర్లు తహతహలాడుతున్నారు.